Homeగాసిప్స్బాలయ్య రెమ్యునరేషన్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

బాలయ్య రెమ్యునరేషన్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

బాలయ్య రెమ్యునరేషన్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
బాలయ్య రెమ్యునరేషన్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

నందమూరి బాలకృష్ణ రెమ్యునరేషన్ పెంచినట్లు ఇటీవల కొన్ని రూమర్స్ వైరల్ అయ్యాయి. ఎన్టిఆర్ బయోపిక్ రెండు భాగాలు అనుకున్నంతగా ఆడలేకపోయినప్పటికీ బాలయ్య రెమ్యునరేషన్ డోస్ పెంచినట్లు కథనాలు వెలువడ్డాయి. రూలర్ నిర్మాత సి.కళ్యాణ్ కూడా బాలకృష్ణ అడిగినంత ఇచ్చినట్లు వార్తలు రావడంతో ఎట్టకేలకు నిర్మాత రూమర్స్ పై క్లారిటీ ఇచ్చాడు.

రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చిన సి.కళ్యాణ్ సినిమాకు సంబందించిన విశేషాలను తేలుపుతూ వచ్చిన రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. “గతంలో బాలయ్యతో పనిచేసిన అనుభవం ఉంది. ఆయన గురించి నాకు బాగా తెలుసు,బాలయ్య డిమాండ్ చేయడం అనేది నెగిటివ్ గా ఉండదు. డౌన్ టూ ఎర్త్ పర్సన్. రెమ్యునరేషన్ విషయంలో బాలయ్య బాబు ఎక్కువగా డిమాండ్ చేయలేదు. అసలు ఆ టాపిక్ మా మధ్యలో రాలేదు” అని సి. కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -

ఇక రూలర్ సినిమా ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తవుతుందని అనుకున్న సమాయానికి సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. రూలర్ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఓ లుక్ ఆడియెన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. కానీ పోలీస్ లుక్ లో మాత్రం బాలకృష్ణ కొంత షాక్ ఇచ్చాడనే చెప్పాలి మరి డిసెంబర్ 20న రిలీజ్ కాబోతున్న రూలర్ ఎంతవరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All