Homeటాప్ స్టోరీస్కంటెంట్ బాగుంటే అదే పెద్ద సినిమా : వి.వి.వినాయ‌క్

కంటెంట్ బాగుంటే అదే పెద్ద సినిమా : వి.వి.వినాయ‌క్

కంటెంట్ బాగుంటే అదే పెద్ద సినిమా : వి.వి.వినాయ‌క్
కంటెంట్ బాగుంటే అదే పెద్ద సినిమా : వి.వి.వినాయ‌క్

సంతోష్ పార్ల‌వార్‌, ఆనంద్ కుమార్, నాగ‌వంశీకృష్ణ‌, వికాస్ చంద్ర, ఉషా, ఏంజిల్‌, వృషాలి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం `ప్రియ‌త‌మా`. ఆర్కే టాకీస్ స‌మ‌ర్ప‌ణ‌లో సంతోష్ పార్ల‌వార్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వినూత్న‌మైన ప్రేమ‌క‌థ‌గా తెర‌కెక్కిన ఈ చిత్ర ట్రైల‌ర్‌ని  ద‌ర్శ‌కులు వి.వి.వినాయ‌క్, ఏ.ఎస్‌. ర‌వికుమార్ చౌద‌రి సంయుక్తంగా విడుద‌ల చేశారు.

ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల మ‌ధ్య సాగే ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ నేప‌థ్యంలో ఈ మూవీని ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిస్తున్నారు. ఈ నెల‌లోనే ఈ మూవీ రిలీజ్‌కి రెడీ అవుతోంది. `చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే అదే పెద్ద సినిమా. ప్రియ‌త‌మా ట్రైల‌ర్ చాలా బాగుంది. ట్రైల‌ర్ చూశాను. యూత్ ఆడియ‌న్స్ ఎంజాయ్ చేసే విధంగా సినిమాని సంతోష్ తెర‌కెక్కించాడు. ఈ మూవీ స‌క్సెస్ అయి టీమ్ అంద‌రికీ మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాను` అన్నారు వి. వి.వినాయ‌క్‌.

- Advertisement -

ద‌ర్శ‌క‌నిర్మాత సంతోష్ పార్ల‌వార్ మాట్లాడుతూ `కొత్త త‌ర‌హా చిత్రాల‌ని ఆదిరించే ప్రేక్ష‌కులు మా చిత్రాన్ని కూడా ఆదిరిస్తార‌నే న‌మ్మ‌క‌ముంది. ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ఈ నెల‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నాం. అన్ని వ‌ర్గాల వారిని ఆక‌ట్టుకుంటుంద‌న్న న‌మ్మ‌క‌ముంది` అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All