
కాలం మారింది.. మనుషులూ మారుతున్నారు.. వైల్డ్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఏది అడగాలో ఏది అడగకూడదన్నది కూడా మరిచి మైండ్‌లో ఏదనిపిస్తే అది అడిగేస్తున్నారు. దీంతో ఆశ్చర్యపోవడం సెలబ్రిటీల వంతవుతోంది. సోషల్ మీడియా వేదికగా నిత్యం ఎవరో ఒకరు బుక్కవుతూనే వున్నారు. తాజాగా హీరోయిన్ ప్రియమణికి ఇలాంటి సంఘటనే ఎదురైంది. పూజా హెగ్డే తరువాత ఈ తరహా కామెంట్‌ని ప్రియమణి ఎదుర్కొంది.
ఇటీవల పూజా హెగ్డే ఇన్ స్టా వేదికగా నగ్న చిత్రం పోస్ట్ చేయమని ఓ నెటిజన్ అడగడం.. దానికి పూజా రిప్లై ఇవ్వడం తెలిసిందే. ఇలాంటి సంఘటనే తాజాగా ప్రియమణికి ఎదురైంది. ఇటీవల ప్రియమణి బ్లాక్ డ్రెస్‌లో కొంచెం హాట్‌గా కనిపిస్తూ ఫోటోషూట్ చేయించుకుంది. సదరు ఫొటోలని సోషల్ మీడియా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దానికి ఓ నెటిజన్ స్పందిస్తూ న్యూడ్ ఫొటోని కూడా పోస్ట్ చేస్తే బాగుంటుందని కామెంట్ చేశాడు. దానికి ప్రియమణి స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
సదరు నెటిజన్‌ని ఉద్దేశిస్తూ `ముందు మీ సోదరి లేదా తల్లిని పోస్ట్ చేయమని అడుగు.. ఆ తరువాత నేను పోస్ట్ చేస్తా` అని రిప్లై ఇచ్చింది ప్రియమణి. ఊహించని సమాధానం రావడంతో తప్పుతెలుసుకున్న నెటిజన్ ప్రియమణికి క్షమాపణలు చెప్పాడు. దీంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ప్రియమణి ప్రస్తుతం తెలుగులో `విరాట పర్వం`, నారప్ప` చిత్రాల్లో నటిస్తోంది.