Homeటాప్ స్టోరీస్యంగ్ హీరోతో ల‌వ్‌.. క్లారిటీ ఇచ్చిన ప్రియ‌మ‌ణి!

యంగ్ హీరోతో ల‌వ్‌.. క్లారిటీ ఇచ్చిన ప్రియ‌మ‌ణి!

Priyamani clarify the rumors of love story with tarun
Priyamani clarify the rumors of love story with tarun

యంగ్ హీరోతో హీరోయిన్ ప్రియ‌మ‌ణి ప్రేమ‌లో వుంద‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై తాజాగా ఆమె వివ‌ర‌ణ ఇవ్వ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. హీరో త‌రుణ్ టాలీవుడ్‌లో ల‌వ‌ర్‌బాయ్ గా పేరు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే. ప్రేమ‌క‌థా చిత్రాల‌తో అమ్మాయిల్లోనూ మంచి క్రేజ్‌ని ద‌క్కించుకున్నారు త‌రుణ్‌. ఆయ‌న కెరీర్ మాంచి జోరుమీద వుండ‌గానే ఆయ‌న న‌టి ఆర్తీ అగ‌ర్వాల్‌తో ప్రేమ‌లో ప‌డ్డార‌ని వార్త‌లు వినిపించాయి.

ఆ త‌రువాత మ‌రో హీరోయిన్ ప్రిమ‌మ‌ణితో ప్రేమాయ‌ణం సాగించార‌ని, ఆమెకు ఓ కార్ ని గిఫ్ట్‌గా ఇచ్చార‌ని, వీరి ప్రేమ పెళ్లికి త‌రుణ్ ఫ్యామిలీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని ప్రచారం జ‌రిగింది. అయితే ఈ ప్ర‌చారంలో ఎలాంటి నిజం లేద‌ని, త‌న‌కు త‌రుణ్ ఎలాంటి గిఫ్ట్‌లు ఇవ్వ‌లేద‌ని ప్రియ‌మ‌ణి ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.

- Advertisement -

`న‌వ‌వ‌సంతం` సినిమా టైమ్‌లో త‌రుణ్‌తో మంచి స్నేహం ఏర్ప‌డింది. అంతే కానీ ప్రేమ అనేది లేద‌ని క్లారిటి ఇచ్చింది. త‌న‌పై వ‌స్తున్న పుకార్ల‌ని ఓ త‌మిళ జ‌ర్న‌లిస్టు చెప్ప‌డంతో అస‌లు విష‌యం త‌న‌కు తెలిసింద‌ని, అంత వ‌ర‌కు త‌ను పుకార్ల గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ని, త‌న పై త‌ప్పుడు ప్ర‌చారం చేసిన జ‌ర్న‌లిస్టుకి ఆ త‌రువాత వార్నింగ్ కూడా ఇచ్చాన‌ని తెలిపింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All