Homeటాప్ స్టోరీస్మహేష్ బాబుని బ్లాక్ మెయిల్ చేస్తున్నదెవరు ?

మహేష్ బాబుని బ్లాక్ మెయిల్ చేస్తున్నదెవరు ?

Pressure on Mahesh Babu to confirm a film with Puri టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారట ! ఇంతకుముందు మహేష్ బాబు – పూరి జగన్నాధ్ ల కాంబినేషన్ లో పోకిరి మొదటి చిత్రంగా రాగా ఆ చిత్రం ప్రభంజనం సృష్టించింది అలాగే మహేష్ కెరీర్ ని పీక్స్ కి తీసుకెళ్లిన సినిమా కూడా అదే ! దాని తర్వాత బిజినెస్ మెన్ చిత్రం చేసాడు మహేష్ . ఆ సినిమా కూడా మంచి హిట్ అయ్యింది అయితే మనం బ్రతికితే చాలు , మనం బ్రతకడానికి ఎన్ని తప్పులు చేసినా ఫరవాలేదు అనే తప్పుడు సంకేతం పంపింది బిజినెస్ మెన్ చిత్రం . అప్పట్లో మహేష్ పై విమర్శలు వచ్చాయి కూడా ఇలాంటి కాన్సెప్ట్ లో ఎలా నటించావ్ అని .

ఇక కొంతమంది సన్నిహితులైతే మహేష్ నీకు ఇలాంటి కాన్సెప్ట్ లు అంతగా నప్పవు ఎందుకంటే నిన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇలా తప్పుడు చిత్రాల్లో నటించొద్దు అని సలహా ఇచ్చారట . అయితే ఆ తర్వాత పూరి జగన్నాధ్ తో సినిమా చేయాలనీ మహేష్ కూడా అనుకున్నాడు కానీ కథ కుదరలేదు , అయితే పూరి మాత్రం అయిదేళ్లుగా మహేష్ వెంట పడుతూనే ఉన్నాడు . ఇక ఇప్పుడేమో బాగా ఒత్తిడి చేస్తున్నాడట . ఒక సినిమా చేసి పెట్టమని , పూరి జగన్నాధ్ కెరీర్ ఇప్పుడు డోలాయమానంలో ఉంది . గతకొంత కాలంగా సక్సెస్ లేక దాదాపుగా కెరీర్ పోయింది . అయితే ఒక్క ఛాన్స్ , ఒక్క ఛాన్స్ అంటూ వేడుకుంటున్నాడట .

- Advertisement -

English Title: Pressure on Mahesh Babu to confirm a film with Puri

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All