Homeటాప్ స్టోరీస్క్రిస్మస్ రోజు కుమ్మేసిన ప్రతిరోజూ పండగే

క్రిస్మస్ రోజు కుమ్మేసిన ప్రతిరోజూ పండగే

Pratiroju Pandage 6 Days Collections
Pratiroju Pandage 6 Days Collections

యంగ్ మెగా హీరో నటించిన ప్రతిరోజూ పండగే చిత్రంతో బయ్యర్లు పండగ చేసుకుంటున్నారు. రివ్యూలు యావరేజ్ గానే ఉన్నా డీసెంట్ మౌత్ టాక్ తో ప్రతిరోజూ పండగే కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. నిన్న క్రిస్మస్ సందర్భంగా సెలవు కావడంతో ఈ చిత్రం ఆ అడ్వాంటేజ్ ను ఫుల్ గా క్యాష్ చేసుకుంది. ఆరో రోజు కూడా మొదటి రోజుకు వచ్చినట్లుగా కలెక్షన్స్ రావడంతో చాలా చోట్ల ప్రతిరోజూ పండగే బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. సీడెడ్, నెల్లూరు వంటి కొన్ని ఏరియాలు తప్పితే మిగతా అన్ని చోట్ల ప్రతిరోజూ పండగే, బయ్యర్లకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. తెలుగులో ఈ చిత్రం 16 కోట్లకు అమ్ముడుపోగా ఆరు రోజుల్లోనే ఈ చిత్రం 15.36 కోట్లు రాబట్టడం విశేషం. నిన్న ఒక్క రోజే దాదాపు 2.80 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. నైజాంలో ఈ సినిమా 5.5 కోట్లకు బిజినెస్ చేయగా, ఇప్పటికే 6.5 కోట్ల షేర్ ను రాబట్టింది.

ఏడో రోజు కలెక్షన్స్ తో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో లాభాల్లోకి రానుంది. మరోవైపు యూఎస్ లో కూడా ప్రతిరోజూ పండగే హవా కొనసాగుతోంది. ఆరో రోజుతోనే $400K మార్క్ ను క్రాస్ చేసింది. ఫుల్ ఫన్ లో ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్లను దాటడం ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -

ఈ చిత్ర ఆరు రోజుల కలెక్షన్స్ బ్రేక్ డౌన్ ను ఒకసారి గమనిస్తే..

నైజాం                                        6.52 కోట్లు
సీడెడ్                                        1.89 కోట్లు
నెల్లూరు                                     0.51 కోట్లు
కృష్ణ                                           1.13 కోట్లు
గుంటూరు                                   1.06 కోట్లు
వైజాగ్                                          2.30 కోట్లు
ఈస్ట్ గోదావరి                               1.11 కోట్లు
వెస్ట్ గోదావరి                                0.84 కోట్లు
ఆరు రోజుల కలెక్షన్స్ షేర్          15.36 కోట్లు

సాయి ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా ఈ చిత్రంలో రావు రమేష్ పాత్ర మెయిన్ హైలైట్ గా నిలిచింది. థమన్ అందించిన పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. అల్లు అరవింద్ తో కలిసి యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All