Homeటాప్ స్టోరీస్ప్రతిరోజూ పండగే 5 డేస్ కలెక్షన్స్: విజయానికి మరింత దగ్గరగా

ప్రతిరోజూ పండగే 5 డేస్ కలెక్షన్స్: విజయానికి మరింత దగ్గరగా

ప్రతిరోజూ పండగే 5 డేస్ కలెక్షన్స్: విజయానికి మరింత దగ్గరగా
ప్రతిరోజూ పండగే 5 డేస్ కలెక్షన్స్: విజయానికి మరింత దగ్గరగా

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ ఏడాది మరో సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. వరస ప్లాపుల తర్వాత ఈ ఏడాది చిత్రలహరితో మొదటి హిట్ ను అందుకున్న తేజ్, ప్రతిరోజూ పండగేతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో వరస ఆరు ప్లాపుల నుండి కొంత ఊరట లభించినట్లయింది. డీసెంట్ టాక్ తో హాలిడే సీజన్ లో ప్రతిరోజూ పండగే, డిస్ట్రిబ్యూటర్ల చేత అదే మాట అనిపిస్తోంది. 18 కోట్లకు బిజినెస్ కాబడ్డ ఈ చిత్రం ఇప్పటికే 13 కోట్లను వసూలు చేయడం విశేషం. నాన్ హాలిడే సీజన్ లో స్ట్రాంగ్ గా ఉన్న ఈ చిత్రం ఈరోజు క్రిస్మస్ సందర్భంగా సెలవు కావడంతో వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది.

ప్రతిరోజూ పండగే 5 రోజుల కలెక్షన్స్ బ్రేక్ డౌన్ ను చూస్తే…
నైజాం :Rs  5.37 Cr
సీడెడ్ : Rs 1.52 Cr
గుంటూరు : Rs 0.87 Cr
వైజాగ్ : Rs 1.88 Cr
ఈస్ట్ గోదావరి : Rs 0.92 Cr
వెస్ట్ గోదావరి: Rs  0.69 Cr
నెల్లూరు: Rs 0.43 Cr
కృష్ణ: Rs 0.87 Cr

- Advertisement -

5 డేస్ కలెక్షన్స్: Rs. 12.55 Cr

మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. రావు రమేష్, సత్యరాజ్ ఈ చిత్రంలో ప్రముఖ పాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా రావు రమేష్ పాత్ర ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. తనదైన శైలిలో రావు రమేష్ ఈ పాత్రకు జీవం పోసాడు. థమన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి బోనస్ లాంటిదని చెప్పొచ్చు. మొత్తానికి ప్రతిరోజూ పండగే, అందరికీ ఆనందాల్ని మిగిల్చిన సినిమా.

సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఇది మే 1న విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీని తర్వాత తేజ్ దేవా కట్టా దర్శకత్వంలో సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All