Homeన్యూస్ప్రాణం ఖరీదు రివ్యూ

ప్రాణం ఖరీదు రివ్యూ

pranam khareedu movie reviewప్రాణం ఖరీదు రివ్యూ :
నటీనటులు : తారకరత్న , ఒరాట ప్రశాంత్ , అవంతిక , షఫి
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
నిర్మాత : నల్లమోపు సుబ్బారెడ్డి
దర్శకత్వం : పిఎల్ కే రెడ్డి
రేటింగ్ : 3 / 5
రిలీజ్ డేట్ : 15 మార్చి 2019

నందమూరి తారకరత్నప్రశాంత్ , అవంతిక కీలక పాత్రల్లో నటించిన చిత్రం ” ప్రాణం ఖరీదు ” . ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మరి ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

- Advertisement -

 

కథ :

రామ్ ( ప్రశాంత్ ) అనే క్యాబ్ డ్రైవర్ ఓ డాక్టర్ ని అలాగే ఓ మీడియేటర్ ని కిడ్నాప్ చేస్తాడు . అంతేకాదు అధికార పార్టీ ఎం ఎల్ ఏ ని , మీడియేటర్ భార్య ని కూడా చంపేస్తాడు . నేను చెప్పినట్లు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడంతో భయపడిపోతారు డాక్టర్ , మీడియేటర్ లు . ఇద్దరిని కిడ్నాప్ చేసి హత్యలు చేస్తున్నదెవరు ? ఎందుకు హత్యలు చేస్తున్నాడు అన్న కోణంలో సాగిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి .  రామ్ అనే క్యాబ్ డ్రైవర్ గా వచ్చింది ఎవరు ? ఎందుకు హత్యలు చేస్తున్నాడు ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

 

హైలెట్స్ :

ప్రశాంత్ యాక్టింగ్

కాన్సెప్ట్

అవంతిక

 

నటీనటుల ప్రతిభ :

ఒరాట ప్రశాంత్ నటనకు కొత్తవాడు అయినప్పటికీ ఎంతో అనుభవమున్న నటుడిలా నటనలో ఇరగదీసాడు . ఈరోజుల్లో కొత్తవాళ్లు వందల సంఖ్యలో వస్తున్నారు తెలుగు తెరకు . వందల సంఖ్యలో తానొకడు కాకుండా తనకంటూ ఓ  ప్రత్యేకత ఉండేలా నటనలో తర్ఫీదు పొంది సిల్వర్ స్క్రీన్ మీదకు దండయాత్ర చేయడానికి వచ్చినట్లుగా ఉన్నాడు ప్రశాంత్ . ఇక పోలీస్ అధికారిగా నందమూరి తారకరత్న బాగా నటించాడు . అవంతిక కు కూడా మంచి పాత్ర లభించింది , దాన్ని స్వద్వినియోగం చేసుకుంది అవంతిక . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రలకు న్యాయం చేసారు .

 

సాంకేతిక వర్గం :

పాటలు ఆకట్టుకునే విధంగా లేవు కానీ నేపథ్య సంగీతంతో అలరించాడు వందేమాతరం శ్రీనివాస్ . మురళీమోహన్ రెడ్డి అందించిన  విజువల్స్ బాగున్నాయి . కొన్ని సీన్లు  ఎడిట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది . నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు విషయానికి వస్తే …… మెడికల్ మాఫియా నేపథ్యంలో కథ ని ఎంచుకొని మంచి ప్రయత్నం చేసాడు . అయితే స్క్రీన్ ప్లే పై మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది .

 

ఓవరాల్ గా :

మెడికల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రాణం ఖరీదు ని తప్పకుండా ఓసారి చూడొచ్చు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All