Homeటాప్ స్టోరీస్హమ్మయ్య ! మొత్తానికి హిట్ కొట్టాడు

హమ్మయ్య ! మొత్తానికి హిట్ కొట్టాడు

judgemental hyekya
judgemental hyekya

ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి ఎట్టకేలకు దర్శకుడిగా హిట్ కొట్టాడు .తాజాగా హిందీలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” జడ్జిమెంటల్ హై క్యా ” . ఈ చిత్రం నిన్న విడుదలైన విషయం తెలిసిందే . కాగా ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది , కంగనా నటనకు అలాగే ప్రకాష్ కోవెల మూడి దర్శకత్వ ప్రతిభకు ప్రశంసలు దక్కుతున్నాయి .

రాఘవేంద్రరావు తనయుడిగా తెలుగు చిత్రరంగంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రకాష్ , అయితే మొదటి చిత్రం డిజాస్టర్ లకే డిజాస్టర్ కావడంతో ఇక నటన నాకు అచ్చిరాదు అని డైరెక్షన్ వైపు దృష్టి పెట్టాడు . దర్శకుడిగా బొమ్మలాట , అనగనగా ఓ ధీరుడు , సైజ్ జీరో చిత్రాలు చేసాడు కానీ అవి ప్లాప్ అయ్యాయి దాంతో తన లక్ ఎలా ఉందో టెస్ట్ చేసుకోవడానికి బాలీవుడ్ వెళ్ళాడు లక్కీ గా జడ్జిమెంటల్ హై క్యా తో హిట్ కొట్టాడు . ఇప్పుడు రాఘవేంద్రరావు కు నిజంగా పుత్రోత్సాహం అనే చెప్పాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All