Homeటాప్ స్టోరీస్ప్ర‌గ‌తి డ్యాన్స్ చూస్తే సీటీ కొట్టాల్సిందే!

ప్ర‌గ‌తి డ్యాన్స్ చూస్తే సీటీ కొట్టాల్సిందే!

ప్ర‌గ‌తి డ్యాన్స్ చూస్తే సీటీ కొట్టాల్సిందే!
ప్ర‌గ‌తి డ్యాన్స్ చూస్తే సీటీ కొట్టాల్సిందే!

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప్ర‌గ‌తి డ్యాన్స్‌తో ర‌చ్చ చేస్తోంది. అదిరిపోయే మాస్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టేస్తోంది. లాక్‌డౌన్ స‌మ‌యంలో క‌రోనా ప్ర‌బ‌‌ల‌డంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. మార్చి నుంచి లాక్‌డౌన్ అమ‌ల్లోకి రావ‌డంతో సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంతా ఇంటికే ప‌రిమితం అయిపోయారు. నిత్యం షూటింగ్‌ల‌తో బిజీగా వుండే సెల‌బ్రిటీలు ఇంట్లోనే కొత్త కొత్త ఫీట్లు చేస్తూ ఆ వీడియోల‌ని అభిమానుల‌తో పంచుకున్నారు.

ఇదే క్ర‌మంలో లుంగీ డ్యాన్స్ చేసి హ‌ల్‌చ‌ల్ చేసింది క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప్ర‌గ‌తి. త‌మిళ పాట‌కి షార్ట్ లో క‌నిపించి మాసీవ్ స్టెప్స్ వేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాలో ర‌చ్చ చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ప్ర‌గ‌తి మ‌రో వీడియోని షేర్ చేసింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

- Advertisement -

జిమ్‌లో వ‌ర్క‌వుట్‌ల కోసం వెళ్లిన ప్ర‌గ‌తి ఓ హిందీ పాట‌కి సీటీ కొడుతూ స్టెప్స్ వేస్తున్న తీరు నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటోంది. 40 ఏళ్ల వ‌య‌సులో ఆమె చేస్తున్న ర‌చ్చ‌ని, ఆమె ఎన‌ర్జీని చూసిన వాళ్లంతా అవాక్క‌వుతున్నారు.  `సింబా` చిత్రంలోని ఈ పాట పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే. ఇదే పాట‌కి ప్ర‌గ‌తి అంతే గ్రేస్‌తో చిందులేయ‌డం చూసిన వాళ్లంతా సీటీ కొట్టాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All