
బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు తొలి సారి హీరోగా నటించిన చిత్రం `30 రోజుల్లో ప్రేమించడం ఎలా?స‌్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద దర్శకత్వం శాఖలో పనిచేసిన మున్నాఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ఎస్వీ బాబు నిర్మించారు. మార్చిలో విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రంలోని `నీలి నీలి ఆకాశం..` సాంగ్ యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌ని రాబట్టింది. అనూప్ రుబెన్స్ సంగీతంలో సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ఇప్పటికి దాదాపు 200 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసింది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాపై హైప్ పెరగడంతో ఈ చిత్రాన్ని థియేటర్స్‌లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు.
కానీ వారి ప్లాన్‌కు కరోనా భారీ షాకిచ్చింది. దీంతో ఏప్రిల్ లో డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించారు కానీ ప్రదీప్ మాత్రం వెయిట్ చేద్దాం అని వారికి నచ్చ జెబుతూ వచ్చాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ, ఏపీల్లో థియేటర్స్ డిసెంబర్ లేదా జనవరిలో మాత్రమే రీఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అంత వరకు ఆగలేక మేకర్స్ ఓటీటీలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. దీనికి ప్రదీప్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్మాత ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలిసింది.