
మిర్యాలగూడకు చెందిన ఓ యువతి తనని ఏకంగా 139 మంది రేప్ చేశారంటూ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పంజాగుట్టా పోలీసుల్ని ఓ యువతి ఆశ్నయించడంతో ఈ కేసు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో సినీ సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ నాయకులు వున్నారంటూ వెల్లడించడంతో ఈ కేసుని పోలీసులు సవాల్ గా తీసుకున్నారు. ఇటీవల ఈ కేసుతో యాంకర్ ప్రదీప్‌కు, నటుడు కృష్ణుడికి లింక్ వుందంటూ వార్తలు వినిపించాయి.
దీనిపై ప్రదీప్ బాహాటంగానే స్పందించారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఈ వార్తలు విని మా ఫ్యామిలీ మనో వేదనకు గురవుతోందని, దీనిపై న్యాయ పోరాటం చేస్తానని యాంకర్ ప్రదీప్ మీడియాని అభ్యర్థిస్తూ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తరువాత కృష్ణుడు కూడా తనకు ఆ అమ్మాయి ఎవరో తెలియదని, అనవసరంగా తనని ఈ కేసులో ఇరికిస్తున్నారని, దీనిపై తాను న్యాయ పోరాటం చేస్తానని వెల్లడించారు.
తనను 139 మంది రేప్ చేశారంటూఅయితే తాజాగా ఈ వివాదంపై సదరు యువతి యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. డాలర్ భాయ్ కారణంగానే తాను సినీ సెలబ్రిటీలపై ఆరోపణలు చేశానని, అయితే ఈ కేసుకీ యాంకర్ ప్రదీప్‌కి, కృష్ణుడుకి ఎలాంటి సంబంధం లేదని, డాలర్ భాయ్ బలవంతం కారణంగానే వారి పేర్లని వెల్లడించానని సదరు యువతి సోమవారం సంచలన ప్రకటన చేసింది. దీంతో యాంకర్ ప్రదీప్ , అతని కుటుంబం ఊపిరి పీల్చుకున్నారు.