Homeటాప్ స్టోరీస్వార్ 2.. ప్రభాస్ రావాల్సిందే ?

వార్ 2.. ప్రభాస్ రావాల్సిందే ?

వార్ 2.. ప్రభాస్ రావాల్సిందే ?
వార్ 2.. ప్రభాస్ రావాల్సిందే ?

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మరో సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. 2019లో మరో బిగ్గెస్ట్ హిట్స్ లో వార్ సినిమా నిలిచింది. ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన వార్ సినిమా ఈ నెల 2న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదలైంది. టైగర్ ష్రాఫ్ – హృతిక్ రోషన్ ఇద్దరు కూడా స్క్రీన్ పై హై వోల్టేజ్ యాక్షన్ ని సక్సెస్ ఫుల్ గా ప్రజెంట్ చేశారు. అందుకే సినిమాను మళ్ళీ మళ్ళీ చూడాలని యాక్షన్ ప్రియులు థియేటర్స్ కి వెళుతున్నారు.

అయితే సినిమా ఫైనల్ గా 300కోట్ల మార్క్ ని అందుకుంది. ఇక సినిమా హిట్టయిన విధానం చూస్తుంటే.. సీక్వెల్ ని కూడా వీలైనంత త్వరగా స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సీక్వెల్ లో మరో హీరోగా ఫ్యాన్ ఇండియన్ స్టార్ హీరో అయితే బెటర్ అని ప్రభాస్ ని సంప్రదించే అవకాశాలు ఉన్నాయట. అతను వస్తే వార్ 2 రేంజ్ సౌత్ లో కూడా సాలీడ్ గా పెరుగుతుందని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యిందట.
ఈ ఏడాది అత్యదిక కలెక్షన్స్ అందుకున్న అతి తక్కువ చిత్రాల్లో వార్ టాప్ లో నిలిచింది. అయితే తెలుగులో మాత్రం సినిమా కలెక్షన్స్ అనుకున్నంత రాలేవు. వార్ లో ప్రభాస్ లాంటి హీరో ఉండి ఉంటే మరోలా ఉండేదని టాక్ వస్తోంది. అందుకే వార్ 2లో రెబల్ స్టార్ ని సెలెక్ట్ చేయడానికి యష్ రాజ్ ఫిలిమ్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All