Homeటాప్ స్టోరీస్హిందీ, తెలుగు మధ్య నలిగిపోతున్న ప్రభాస్

హిందీ, తెలుగు మధ్య నలిగిపోతున్న ప్రభాస్

హిందీ, తెలుగు మధ్య నలిగిపోతున్న ప్రభాస్
హిందీ, తెలుగు మధ్య నలిగిపోతున్న ప్రభాస్

అనుకుంటాం కానీ భారీ ఇమేజ్ వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడం కూడా కష్టమే. ప్యాన్ ఇండియా రిలీజ్ అంటూ ఆకాశానికి నిచ్చెనలు వేసేసేవారు చాలా మంది ఉంటారు కానీ సరైన ప్లానింగ్ లేకపోతే ఏమవుతుందో మనం చూసాం. అయితే ప్రభాస్ విషయంలో దీనికి భిన్నంగా జరుగుతోంది. బాహుబలితో వచ్చిన ఆకాశమంత ఇమేజ్ ను క్యాష్ చేసుకోవడానికి తెలుగు చిత్రంగా చేద్దామనుకున్న సాహోను ప్యాన్ ఇండియాగా మార్చి అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ కూర్చి భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.

సాహో హిందీ ప్రేక్షకులకు ఈ చిత్రం తెగ నచ్చేసింది. 150 కోట్ల షేర్ ను వారు అందించారు. ఒక్క నార్త్ నుండే ఇంత పెద్ద మొత్తం అంటే చాలా ఎక్కువ. అయితే నార్త్ లో సూపర్ హిట్ అయిన సాహో మిగిలిన అన్ని చోట్లా కూడా ఎత్తేసింది. ముఖ్యంగా తెలుగు వాళ్లకు ఈ సినిమా నచ్చలేదు. ఇదే ఇప్పుడు ప్రభాస్ ను చిక్కుల్లో పడేస్తోంది.

- Advertisement -

సాహో తర్వాత ప్రభాస్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్యూర్ లవ్ స్టోరీ చేస్తున్న విషయం తెల్సిందే. హిందీ ప్రేక్షకులకు ఆల్రెడీ దగ్గరైన ప్రభాస్ ఇప్పుడు ప్యూర్ లవ్ స్టోరీ చేస్తే ఎలా ఆదరిస్తారో తెలీదు. లేదా యాక్షన్ ఘట్టాలు జోడిస్తే.. సాహో ఎక్కలేదు కాబట్టి ఈ చిత్రాన్ని ఆదరిస్తారో లేదో తెలీదు. అందుకే ప్యాన్ ఇండియా ఇమేజ్ ఇప్పుడు ప్రభాస్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. తెలుగు, హిందీ మధ్య ఎటూ తేల్చుకోలేక నలిగిపోతున్నాడు ప్రభాస్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All