Homeటాప్ స్టోరీస్ప్రభాస్ కు అతని ఫ్యాన్సే విలన్లా?

ప్రభాస్ కు అతని ఫ్యాన్సే విలన్లా?

Prabhas
Prabhas

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన అభిమానుల్ని డార్లింగ్స్ అని పిలుస్తారు. ఫ్యాన్స్ కు ఇంతకుమించిన ఆత్మీయ పిలుపు ఏముంటుంది? అందుకే ఫ్యాన్స్ కూడా ప్రభాస్ ను డార్లింగ్ అంటూ సంభోదిస్తారు. కానీ ఇప్పుడు తన ఫ్యాన్స్ వల్లే ప్రభాస్ కు చెడ్డ పేరు వస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఐదుగురు టాప్ హీరోలు ఉన్నారు. చిరంజీవిని పక్కనపెడితే మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్. వీరిలో ఎవరి ఫ్యాన్స్ వారికి ఉన్నారు.

అలాగే ప్రతీ హీరోకి యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు ఒక్క ప్రభాస్ కు తప్ప. ఒక స్టార్ హీరో ఫ్యాన్స్ మరో స్టార్ హీరో ను ట్రోల్ చేయడం, దానికి ఈ హీరో ఫ్యాన్స్ స్పందించడం, సోషల్ మీడియాలో వీటిపై పెద్ద పెద్ద యుద్ధాలే కనిపిస్తాయి. అయితే ఏ ఫ్యాన్ వార్ లోనూ ప్రభాస్ గురించి ప్రస్తావనే ఉండదు. నిజానికి ప్రభాస్ కు యాంటీ ఫ్యాన్సే ఉండరు. ప్రతి స్టార్ హీరో ఫ్యాన్స్ ప్రభాస్ ను కూడా ఇష్టపడతారు.

- Advertisement -

అయితే సాహో విడుదలకు ముందు ఇలాగే ఉన్న పరిస్థితిలో ఇప్పుడు తేడా వచ్చింది. మెగా ఫ్యాన్స్ ప్రభాస్ ను టార్గెట్ చేస్తున్నారు. దీనికి కారణం ప్రభాస్ ఫ్యాన్సే. సైరా విడుదలయ్యాక, హిందీలో వసూళ్లు సాధించడంలో ఫెయిల్ అయిన విషయం తెల్సిందే. దీన్ని సాకుగా చూపిస్తూ చిరంజీవి వంటి స్టేచర్ ఉన్న హీరోని ప్రభాస్ ఫ్యాన్స్ టార్గెట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ కు మండింది. పైగా ప్రభాస్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి, రజినీకాంత్ వంటి వారు లెజండ్స్ అని మేము ఎంత చేసినా వారి రేంజ్ కు చేరుకోలేమని చెప్పడం అందరం చూసాం.

అయినా కానీ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ చిరంజీవిని ట్రోల్ చేయడంతో వారంతా ఇప్పుడు ప్రభాస్ లో ఉన్న నెగటివ్స్ వెతుకుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రభాస్ కు కూడా యాంటీ ఫ్యాన్స్ వచ్చే ప్రమాదముంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All