Homeటాప్ స్టోరీస్సాహో రిలీజ్ డేట్ వచ్చేసింది :విజయ్ దేవరకొండే కారణమా

సాహో రిలీజ్ డేట్ వచ్చేసింది :విజయ్ దేవరకొండే కారణమా

Prabhas Saaho release date lockedప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సాహో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు . హీరో విజయ్ దేవరకొండ ప్రభాస్ ని అన్నా సాహో సినిమా గురించి అప్ డేట్స్ ఇవ్వండన్నా అని కోరడంతో ఈ విధంగా రిలీజ్ డేట్ ప్రకటించారు అనిపిస్తోంది . ఇక సాహో విడుదల అయ్యేది ఎప్పుడో తెలుసా …… 2019 ఆగస్ట్ 15 న . స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సాహో చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం . ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటిస్తుండగా సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .

200 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు , తమిళ , హిందీ బాషలలో రూపొందిస్తున్నారు ఈ చిత్రాన్ని . ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు ప్రభాస్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన మేకింగ్ వీడియో సంతోషాన్ని అందించింది . మేకింగ్ వీడియో తో సాహో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఇక ఈ సినిమా అప్ డేట్స్ ఏమి తెలియకపోవడంతో విజయ్ దేవరకొండ సాహో అప్ డేట్స్ చేప్పండన్నా అని ట్వీట్ చేయడంతో ఎట్టకేలకు రిలీజ్ డేట్ ప్రకటించారు . అయితే ఇంకా 9 నెలలు ఎదురు చూడాలి సాహో కోసం .

- Advertisement -

English Title: Prabhas Saaho release date locked

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All