Homeటాప్ స్టోరీస్ఇకపై తప్పు చేయనంటున్న విజయ్ దేవరకొండ

ఇకపై తప్పు చేయనంటున్న విజయ్ దేవరకొండ

NOTA teach a lession for me : Vijay devarakonda విజయ్ దేవరకొండ ఇక పై తప్పు చేయనని అంటున్నాడు . నోటా చిత్రం నేను చేసిన పెద్ద తప్పు అందుకే అలాంటి తప్పులు ఇకపై చేయకూడదని నిర్ణయించుకున్నానని తెలిపాడు ఈ హీరో . నోటా చిత్రం తెలుగు , తమిళ బాషలలో చేయగా ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది . మంచి కథ కావడంతో ఒప్పుకున్నాను కానీ దాన్ని సరైన దిశలో నడిపించలేకపోయాడు దర్శకుడు . సినిమా విడుదలకు ముందు ఎక్కడెక్కడ తప్పులున్నాయో తెలిసింది కానీ అప్పటికే ఆలస్యం జరిగిందని రిలీజ్ సమయం కాబట్టి నోరు మూసుకొని ఉండాల్సి వచ్చిందని అందుకే ఇకపై జాగ్రత్తలు తీసుకోవాలని డిసైడ్ అయ్యానని అంటున్నాడు .

ఇక ఆ సినిమాని పక్కన పెడితే నిన్న విడుదలైన టాక్సీ వాలా చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది . విజయ్ దేవరకొండ సినిమా విడుదలకు ముందు చెప్పినట్లుగా పెద్ద హిట్ కాదు కానీ ఓ మాదిరి హిట్ అవ్వడం ఖాయమైపోయింది అందుకే ఇకపై ఒకేసారి సినిమాలు చేసే బదులుగా ఒక సినిమా కంప్లీట్ అయ్యాక మరో సినిమా చేయాలనీ నిర్ణయం తీసుకున్నాడట . నోటా నేర్పిన గుణపాఠంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు విజయ్ దేవరకొండ .

- Advertisement -

English Title: NOTA teach a lession for me : Vijay devarakonda

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All