Homeటాప్ స్టోరీస్ప్రభాస్ - పవన్ లను ఆలా చూసేందుకు రెండు కళ్లు చాల్లేదట

ప్రభాస్ – పవన్ లను ఆలా చూసేందుకు రెండు కళ్లు చాల్లేదట

ప్రభాస్ - పవన్ లను ఆలా చూసేందుకు రెండు కళ్లు చాల్లేదట
ప్రభాస్ – పవన్ లను ఆలా చూసేందుకు రెండు కళ్లు చాల్లేదట

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ ప్రభాస్పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరు. మిగతా హీరోలు పబ్లిక్ గా ఎక్కువగా కనిపించడం..సోషల్ మీడియా లో యాక్టివ్ ఉండడం చేస్తుంటారు. కానీ పవన్ , ప్రభాస్ మాత్రం వేరు. సోషల్ మీడియా కు చాల దూరంగా ఉంటారు. వీరి పనేంటో..వీరేంటో అంతే. అలాంటి వీరిద్దరూ కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయడం అనే న్యూస్ ఇప్పుడు అభిమానుల్లో సంతోషం నింపుతుంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలోని ఓ సాంగ్ షూట్ ను రామోజీ ఫిలిం సిటీ లో షూట్ చేస్తున్నారు. అదే సమయంలో ఆ పక్కనే ప్రభాస్ ప్రాజెక్ట్ కే మూవీ షూటింగ్ నడుస్తుంది. ఈ సినిమా లో బిగ్ బో అమితాబ్ కూడా నటిస్తున్నాడు. షూటింగ్ లో భాగంగా అమితాబచ్చన్ ప్రత్యేకంగా ముంబై నుంచి వచ్చారు.  అమితాబచ్చన్ అంటే పవన్ కళ్యాణ్ కు ఒక ప్రత్యేకమైన గౌరవం అని అందరికీ తెలిసిందే. అయితే ఆయన వచ్చారని తెలుసుకుని పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ K సెట్స్ లోకి వెళ్లి అబితాబ్ బచ్చన్ ను ప్రత్యేకంగా కలుసుకున్నారట. అక్కడే ఉన్న ప్రభాస్ ను కూడా ప్రత్యేకంగా కౌగిలించుకునే కాసేపు సరదాగా మాట్లాడుకున్నారట.

- Advertisement -

పవన్ కళ్యాణ్ బ్రేక్ ఫాస్ట్ సమయంలో రావడంతో ప్రభాస్ కూడా ప్రత్యేకంగా అమితాబ్ బచ్చన్ తో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ముగ్గురు హీరోలు కూడా అలా సరదాగా మాట్లాడుకుంటూ బ్రేక్ ఫాస్ట్ చేయడంతో ప్రాజెక్ట్  K యూనిట్ సబ్యులకు ఆ ముగ్గురిని చూసి ఎంతో సంతోషం వేసిందట. ముఖ్యంగా పవన్ – ప్రభాస్ లు కలుసుకోవడం , ఒకరికారు ఆప్యాయంగా పలకరించుకోవడం, బ్రేక్ ఫాస్ట్ చేయడం చూసేందుకు రెండు కళ్లు చాల్లేదట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All