Homeటాప్ స్టోరీస్ముంబైలో ప్ర‌భాస్ హ‌ల్‌చ‌ల్‌!

ముంబైలో ప్ర‌భాస్ హ‌ల్‌చ‌ల్‌!

ముంబైలో ప్ర‌భాస్ హ‌ల్‌చ‌ల్‌!
ముంబైలో ప్ర‌భాస్ హ‌ల్‌చ‌ల్‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ య‌మ బిజీగా వున్నారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. యువీ క్రియేష‌న్స్‌, టి సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రా‌న్ని నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవ‌లే ఇట‌లీలో ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న ప్ర‌భాస్ ఇండియా తిరిగి వ‌చ్చేశారు.

ఇటలీ నుండి ప్రభాస్ నేరుగా ముంబైలో అడుగుపెట్టారు. ముంబైలోని పూరి క‌నెక్ట్స్ ఆఫీస్‌లో సంద‌డి చేసిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ముంబైలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. త‌న నెక్స్ట్ మూవీని బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్‌తో చేస్తున్న విష‌యం తెలిసిందే. `ఆదిపురుష్‌` పేరుతో పాన్ ఇండియా స్థాయిలో తుఎర‌పైకి రానున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతోంది. ఈ సంద‌ర్భంగా ముంబైలో దిగిన ప్ర‌భాస్ ఈ మూవీ ప్రీ విజువలైజేషన్ గురించి ప్రభాస్ దర్శకుడు ఓం రౌత్‌ తో మాట్లాడుతున్నార‌ట‌.

- Advertisement -

ఇందు కోస‌‌మే ప్ర‌భాస్ ముంబైలో స్టే చేసిన‌ట్టు తెలిసింది. `బాహుబలి`కి మించి ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ ఈ మూవీలో వుంటాయ‌ని తెలిసింది. దీంతో షూట్ కి వెళ్ళే ముందు స్పష్టత కోసం దర్శకుడు ఓం ప్రభాస్ అభిప్రాయాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 400 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All