
యంగ్ రెబల్ స్టార్ ప్రభస్ ఓ భారీ చిత్రం అండర్ ప్రొడక్షన్‌లో వుండగానే మరో చిత్రాన్ని లైన్‌లోకి తీసుకొచ్చారు. ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. ఫిక్షనల్ పిరియాడిక్ ఫిల్మ్‌గా యూరప్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గోపీ కృష్టా మూవీస్ సమర్పణలో యువీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో నిర్మిర్మిస్తోంది.
ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు ప్రభాస్ తాజాగా నాగ్ అశ్విన్ చిత్రాన్ని అంగీకరించిన విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తోంది. సైన్స్ ఫిక్షన్‌గా తెరపైకి రానున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ క్రేజీ సుందరి దీపికా పదుకునే నటించనుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే.
దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్‌కు చెందిన టెక్నీషియన్‌లతో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ మూడవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగుతుందని, ప్రభాస్ యుద్ధ వీరుడిగా ఫెరోషియస్ పాత్రలో కనిపిస్తారని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూటింగ్‌ని ప్లాన్ చేస్తున్నారు. 2022లో విడుదల చేయనున్నారట.