Homeటాప్ స్టోరీస్నిప్పులు చెరిగిన ప్రభాకర్

నిప్పులు చెరిగిన ప్రభాకర్

prabhakar fires on his selfish friendsబుల్లితెర మెగాస్టార్ గా పేరు గాంచిన ప్రభాకర్ అలియాస్ ఈటివి ప్రభాకర్ తన మిత్రులపై నిప్పులు చెరిగాడు . తనవల్ల సహాయం పొందిన పలువురు సినీరంగంలో ఉన్నారని అయితే నేను దర్శకత్వం వహించిన ” బ్రాండ్ బాబు ” ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడానికి మొహమాట పడ్డారని , అసలు ఇష్టపడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు . అయితే యాంకర్ ప్రదీప్ మాత్రం నేను అడగ్గానే వెంటనే ట్విట్టర్ లో టీజర్ ని పోస్ట్ చేసాడని కానీ నా సహాయం పొందిన వాళ్ళు మాత్రం అంతగా పట్టించుకోలేదని ఫైర్ అవుతున్నాడు .

స్నేహితుడు దర్శకుడిగా చేస్తున్న చిత్రం అనగానే వాళ్ళు దాని గురించి తెలుసుకొని మరీ సహాయం చేయాలనీ కానీ నేను కొంతమంది కి పనిగట్టుకొని చేపినప్పటికీ వాళ్ళు మర్చిపోయారని అంటున్నాడు . అయితే నేను ఒక్కడిని ఉన్నపుడు మాత్రం నువ్ గొప్పోడివి , చాలా సహాయం చేసావు అంటూ పొగుడుతారని ఆవేశం వ్యక్తం చేస్తున్నాడు ప్రభాకర్ . నిజమే ప్రభాకర్ ఆవేదనలో నిజం ఉంది , సహాయం పొందిన వాళ్ళు చాటుమాటు పొగడ్తలు మానేసి తమకు అవకాశం వచ్చినప్పుడు తిరిగి సహాయం చేస్తేనే సమాజంలో మంచి బ్రతుకుతుంది అంతేకాని స్వార్థంతో వ్యవహరిస్తే , అవసరం తీరాక బోడ మల్లన్న లా చూస్తే అప్పుడు కాలుతుంది చూడూ ….. ! ఇప్పుడు అదే మూడ్ లో ఉన్నాడు ప్రభాకర్ .

- Advertisement -

English Title: prabhakar fires on his selfish friends

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All