Homeటాప్ స్టోరీస్ఆ చిన్న సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి

ఆ చిన్న సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి

possitive reports on co kancherapalem కేరాఫ్ కంచరపాలెం చిత్రం పై అంచనాలు బాగానే ఉన్నాయి . వెంకట్ మహా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది . పెద్దగా తెలియని నటీనటులు అయినప్పటికీ ఆ సినిమా ఔట్ ఫుట్ బాగా రావడంతో అగ్ర నిర్మాత సురేష్ బాబు తన బ్యానర్ పై విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . అసలు ఈ సినిమాని తీసింది సురేష్ బాబు కాదు కానీ సినిమా గురించి తెలియడంతో అది నచ్చడంతో తన బ్యానర్ పై విడుదల చేయడానికి సిద్దమయ్యాడు .

సెప్టెంబర్ 7న ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అందులో భాగంగా రానా కేరాఫ్ కంచరపాలెం ట్రైలర్ ని విడుదల చేసాడు అంతేకాదు చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించబోయే సినిమా అంటూ ట్వీట్ పెట్టాడు కూడా . వైవిధ్యభరితంగా తెరకెక్కిన ఈ చిత్రం పై సురేష్ బాబు చాలా నమ్మకంగా ఉన్నాడు . ఇక ట్రైలర్ కూడా కేరాఫ్ కంచరపాలెం పై అంచనాలు పెంచేలా ఉంది . సెప్టెంబర్ 7న విడుదల అవుతున్న ఈ చిత్రానికి సురేష్ బాబు అండ ఉండటంతో మంచి థియేటర్ లు లభిస్తాయి కాబట్టి అక్కడే సగం విజయం సాధించినట్లు లెక్క ,ఇక మిగతా విజయం ప్రేక్షకులు ఇవ్వాలి .

- Advertisement -

English Title: possitive reports on c/o kancherapalem

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All