Homeటాప్ స్టోరీస్జనాలు లేక వెలవెల బోతున్న థియేటర్ లు

జనాలు లేక వెలవెల బోతున్న థియేటర్ లు

poor collections for lover , wife of ram , aatagadara shiva నిన్న మూడు సినిమాలు విడుదల అయ్యాయి అయితే ఆ మూడు సినిమాలను వేసిన థియేటర్ లలో జనాలు లేక వెలవెల బోతున్నాయి . అసలు వేసిందే తక్కువ థియేటర్ లు , ఆపై ఉన్న తక్కువ థియేటర్ లలో కూడా ప్రేక్షకులు లేక బోసి పోతున్నాయి సినిమా హాళ్లు . నిన్న రిలీజ్ అయిన మూడు సినిమాలు లవర్ , వైఫ్ ఆఫ్ రామ్ , ఆటగదరా శివ . రాజ్ తరుణ్ హీరోగా నటించిన లవర్ చిత్రానికి ముందే పాజిటివ్ టాక్ లేదు ఎందుకంటే స్వయంగా దిల్ రాజు రాజ్ తరుణ్ పై ఆ సినిమాపై కామెంట్ చేసి తానే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యేలా చేసాడు దానికి తోడు గతకొంతకాలంగా రాజ్ తరుణ్ వరుస ప్లాప్ లతో సతమతం అవుతున్నాడు .

ఇక వైఫ్ ఆఫ్ రామ్ చిత్ర విషయానికి వస్తే ……. మంచు లక్ష్మి నటించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది కానీ ఈ సినిమాకు కూడా జనాలు లేక థియేటర్లన్నీ బోసి పోయాయి . మంచు లక్ష్మి హిట్ కోసం ఎంతగా పోరాడుతున్నప్పటికీ ఆమెకు మాత్రం అందని ద్రాక్షే అవుతోంది విజయం . ఇక ఆటగదరా శివ చిత్రానికి కూడా కాస్త మంచి రివ్యూస్ వచ్చాయి కానీ ఆ సినిమాని కూడా ఓన్ చేసుకోలేక పోతున్నారు ప్రేక్షకులు . ఈ మూడు సినిమాలకు ప్రేక్షకులు కరువయ్యారు కానీ యువత మాత్రం ఆర్ ఎక్స్ 100 ని చూడటానికి ఎగబడుతున్నారు దాంతో వసూళ్లు బాగానే వస్తున్నాయి ఆ సినిమాకు . ఇక ఈ మూడు సినిమాలకు పోస్టర్ ఖర్చులు కూడా వచ్చేలా లేవు అంత దారుణంగా ఉన్నాయి వసూళ్లు .

- Advertisement -

English Title: poor collections for lover wife of ram aatagadara shiva

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All