
పూనమ్ కౌర్ చాల ఏళ్ల తర్వాత డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది..మాట్లాడమే కాదు పలు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈమె నటించిన నాతిచరామి మూవీ ఓటిటి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ లో పాల్గొంటూ సినిమా విశేషాలను పంచుకుంటుంది.
ముఖ్యంగా పవన్ తో వివాదం గురించి స్పందించమని చానెల్ యాంకర్ అడిగారు. కానీ పూనమ్ నవ్వుతూనే కాస్త ఎమోషనల్ గా ఫీలైంది… కాంట్రవర్శీ.. ఇంకేం చెప్పను.. అదే కదా ఫ్యాక్ట్.. అంటూ సమాధానాలిచ్చింది. పవన్ కల్యాన్ గారి గురించి చెప్పాలంటే ఏం చెబుతారు. యాక్ట్ చేశారు కదా ఆయనతో కలిసి? అంటే… “నేను చేయలేదు.. చేయనివ్వలేదు.. చాలా మంది!” అంటూ నవ్వేసింది. ఆయన గురించి ఏదైనా చెప్పండి.. పాజిటివ్ గా చెప్పండి అని అడిగారు యాంకర్. ఆయన గురించి పాజిటివ్ చెప్పినా నెగెటివ్ అవుతుంది అనేస్తూ కాస్త ఎమోషనల్ అయ్యింది పూనమ్. “అయ్యయ్యో నాకు సిగ్గు వచ్చేస్తుంది! దేవుడా!” అంటూ ఫ్రీజ్ అయిపోయింది పూనమ్.
వెయిట్ వెయిట్ వెయిట్.. యాక్చువల్లీ ఐ హ్యావ్ ఏ వర్డ్.. దేవుడా! అంటూ పూనమ్ కౌర్ చాలా మ్యాజిక్ చేసింది. పవన్ గురించి అసలేమీ మాట్లాడలేక తడబడింది. గమ్మత్తయిన ఫన్నీ ఎమోషనల్ ఇంటర్వ్యూ లో ఇచ్చింది.