Homeటాప్ స్టోరీస్కరోనా భయాల మధ్య జార్జియా వెళ్లిన పూజ హెగ్డే

కరోనా భయాల మధ్య జార్జియా వెళ్లిన పూజ హెగ్డే

కరోనా భయాల మధ్య జార్జియా వెళ్లిన పూజ హెగ్డే
కరోనా భయాల మధ్య జార్జియా వెళ్లిన పూజ హెగ్డే

ప్రస్తుతం కరోనా వైరస్ భయం ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో ఇప్పుడు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. మన దేశంలో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 72కు చేరుకుంది. ఇక రీసెంట్ గా ఒక మరణం కరోనా వల్లనే అని అంటున్నారు కానీ అందులో నిజమెంతుందో తెలియాలి. కరోనా వల్లనే అయితే మాత్రం భారతదేశంలో తొలి కరోనా మరణం నమోదైనట్లే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రభావంతో జనాలు ఇళ్ళు వదిలి బయటకు రావడానికి జంకుతున్నారు. ముఖ్యంగా థియేటర్లు, షాపింగ్ మాల్స్ వంటివి నిర్మానుష్యంగా మారుతున్నాయి. భారతదేశంలో ఈ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది కానీ యూఎస్, ఇటలీ వంటి దేశాల్లో పరిస్థితి భయానకంగా ఉంది.

ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రభాస్ అండ్ కో ఓ డియర్ సినిమా షూటింగ్ కోసం యూరోప్ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ జార్జియా దేశంలో షూటింగ్ చేస్తున్నారు. కరోనా భయం వల్ల అక్కడ షూటింగ్ ను అంతరాయం కలిగింది అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి కానీ ఇటీవలే ఒక ఛేజ్ సీక్వెన్స్ ను పూర్తి చేశామని ఈ చిత్ర దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తెలియజేయడంతో ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ ఆ దేశంలోనే జరుగుతోంది.

- Advertisement -

ఇక ఓ డియర్ లో హీరోయిన్ గా ఎంపికైన పూజ హెగ్డే సోషల్ మీడియాలో తాను షూటింగ్ కోసం జార్జియా వెళ్తున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండు, ఇలాంటి సమయంలో అవసరమా అన్నట్లుగా నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అయితే జార్జియాలో ఇంకా కరోనా వ్యాప్తి చెందలేదు. అందుకే ప్రభాస్ అండ్ కో కు వీసాలు కూడా దొరికాయి. కరోనా భయం ఉన్న దేశాలు వీసాలు క్యాన్సిల్ చేస్తున్న విషయం తెల్సిందే. కరోనా భయం లేని కారణంగా జార్జియాలో ప్రభాస్ సినిమా షూటింగ్ నిరాటంకంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉగాదికి ఓ డియర్ ఫస్ట్ లుక్ ఉంటుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All