Homeటాప్ స్టోరీస్'బుట్ట బొమ్మ' ప్యాన్ ఇండియాకు కేరాఫ్ అడ్రస్

‘బుట్ట బొమ్మ’ ప్యాన్ ఇండియాకు కేరాఫ్ అడ్రస్

'బుట్ట బొమ్మ' ప్యాన్ ఇండియాకు కేరాఫ్ అడ్రస్
‘బుట్ట బొమ్మ’ ప్యాన్ ఇండియాకు కేరాఫ్ అడ్రస్

అల వైకుంఠపురములో సినిమాలో బుట్ట బొమ్మ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆ చిత్రంలో బుట్ట బొమ్మగా నటించిన పూజ హెగ్డే క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పూజ హెగ్డే కు ఉన్న డిమాండ్ ఇప్పుడు ఏ హీరోయిన్ కు లేదంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్, బాలీవుడ్ తో సహా భారీ ప్రాజెక్టులకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.

రీసెంట్ గా పూజ హెగ్డే నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కానీ కలెక్షన్స్ ఎంకరేజింగ్ గా ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో విభ  గా కనిపించింది పూజ. స్టాండప్ కమెడియన్ గా ఆమె నవ్వులు పూయించింది. అలాగే బొమ్మరిల్లు భాస్కర్ పూజకు స్ట్రాంగ్ రోల్ ఇచ్చాడు. దీంట్లో తనదైన శైలిలో నటించి మెప్పించింది ఈ భామ.

- Advertisement -

ఇక ఈ తర్వాత పూజ వరసగా ప్యాన్ ఇండియా చిత్రాలతో ధూమ్ ధామ్ చేయడానికి సిద్ధంగా ఉంది. పూజ హెగ్డే నటించిన రాధే శ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది. విజయ్ తో బీస్ట్ లో నటిస్తోంది. పూజ. అలాగే రణ్వీర్ సింగ్ హీరోగా సర్కస్ తెరకెక్కుతోంది. ఈ మూడు చిత్రాలు కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All