Homeటాప్ స్టోరీస్మరోసారి పూజ హెగ్డేతోనే హరీష్ శంకర్!!

మరోసారి పూజ హెగ్డేతోనే హరీష్ శంకర్!!

మరోసారి పూజ హెగ్డేతోనే హరీష్ శంకర్!!
మరోసారి పూజ హెగ్డేతోనే హరీష్ శంకర్!!

దర్శకుడు హరీష్ శంకర్ డీజే చిత్రంలో పూజ హెగ్డేను హీరోయిన్ గా పెట్టాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆ చిత్రం డీసెంట్ ఫలితమే రాబట్టింది. ఆ తర్వాత హరీష్ శంకర్ తీసిన గద్దలకొండ గణేష్ లో చిన్న పాత్ర అయినా కూడా పూజ హెగ్డే నటించింది. ఆమె చేసిన ఎల్లువొచ్చి గోదారమ్మ రీమిక్స్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం మూడోసారి పూజ హెగ్డేతో హరీష్ శంకర్ పనిచేస్తున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. ఈ చిత్రానికి భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఈ ఏడాది చివరి నుండి రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెడతారని సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పుడు హరీష్ శంకర్ ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ అని అనౌన్స్ చేసాడు. హరీష్ తో పూజకు హ్యాట్రిక్ సినిమా కాదా పవన్ కళ్యాణ్ తో మొదటిది. ఇకపోతే హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కలిసి ఇంతకు ముందు గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ను అందించిన విషయం తెల్సిందే.

- Advertisement -

మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలుస్తాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All