HomeVideos`పొగ‌రు` డైలాగ్ ట్రైల‌ర్ అదిరిందిగా!

`పొగ‌రు` డైలాగ్ ట్రైల‌ర్ అదిరిందిగా!

`పొగ‌రు` డైలాగ్ ట్రైల‌ర్ అదిరిందిగా!
`పొగ‌రు` డైలాగ్ ట్రైల‌ర్ అదిరిందిగా!

హీరో దృవ‌ స‌ర్జా న‌టించిన క‌న్న‌డ చిత్రం `పొగ‌రు`. ఇందులో క్రేజీ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టించింది. ఈ చిత్రాన్ని ఇదే పేరుతో తెలుగులో సాయి సూర్యా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్  బ్యాన‌ర్‌పై డి. ప్ర‌తాప్ రాజు అందిస్తున్నారు. తెలుగులో ర‌ష్మిక‌కు వున్న డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కులకు అందిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన `క‌రాబు` తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఓ రేంజ్‌లో ఊపేస్తోంది.

యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌ని రాబ‌ట్టి రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఈ మూవీ డైలాగ్ ట్రైల‌ర్‌ని చిత్ర బృందం శుక్ర‌వారం విడుద‌ల చేసింది. అడ్ర‌స్‌ క‌నుక్కుని స‌ర్వీస్ చేయ‌డానికి కొరియ‌ర్ బాయ్‌ని అనుకున్నార్రా.. ఫైట‌ర్‌.. కొడితే ఎవ‌డి అడ్ర‌స్ అయినా గ‌ల్లంత‌వ్వాల్సిందే. .. అంటూ హీరో ధృవ స‌ర్జా చెబుతున్న ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌తో ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

- Advertisement -

ఈ చిత్రంలో హీరో దృవ‌ స‌ర్జా ఫైట‌ర్‌గా మాస్ లుక్‌లో క‌నిపిస్తుండ‌గా హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న‌మాత్రం అత‌ని వ‌ల్ల ఇబ్బందులు ప‌డే ఇన్నోసెంట్ అమ్మాయిగా క‌నిపిస్తోంది. త్వ‌ర‌లో మ‌రో ట్రైల‌ర్‌ని విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌. ఈ చిత్రానికి చంద‌న్‌శెట్టి సంగీతం అందించాడు. ఎస్‌.డి. విజ‌య్ మిల్ట‌న్ ఛాయాగ్ర‌హ‌ణం, చంద‌న్‌శెట్టి సంగీతం, కె.ఎం. ప్ర‌కాష్ ఎడిటింగ్‌, ర‌ష్మిక గ్లామ‌ర్, హీరో దృవ‌ స‌ర్జా మాస్ అప్పీల్ ఈ మూవీకి ప్ర‌ధాన బ‌లంగా క‌నిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All