Homeటాప్ స్టోరీస్ప్లే బాయ్ కు కరోనా దెబ్బ.. 66 ఏళ్లలో తొలిసారి

ప్లే బాయ్ కు కరోనా దెబ్బ.. 66 ఏళ్లలో తొలిసారి

 

Play boy magazine to shut due to Corona Virus
Play boy magazine to shut due to Corona Virus

కరోనా వైరస్ ప్రపంచంలో ఎవరినీ వదలట్లేదు. ఈ మహమ్మారి వ్యాప్తి నుండి తప్పించుకునేందుకు అన్ని దేశాలు  లాక్ డౌన్ ను ప్రకటించడం మినహా చేసేదేం లేకుండా పోతోంది. ఇండియాలో కూడా పలు రాష్ట్రాల్లో ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ ను ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు చాలా ఇండస్ట్రీస్ కరోనా వైరస్ దెబ్బకు మూసేయాల్సిన పరిస్థితికి చేరుకుంది. ఏ ఇండస్ట్రీని వదిలిపెట్టకుండా కరోనా అన్నింటిపై ఎఫెక్ట్ చూపిస్తోంది. ముఖ్యంగా ప్రింట్ మీడియాపై దీని ప్రభావం ఎక్కువగానే పేపర్, మ్యాగజిన్ లాంటివి కొనాలంటే జనాలు హడిలిపోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్లే బాయ్ మ్యాగజిన్ పబ్లిషింగ్ ను తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ బెన్ కాన్ మీడియాకు విడుదల చేసిన లేఖలో స్పష్టం చేసారు.

- Advertisement -

ప్లే బాయ్ అనగానే కవర్ పేజ్ పై ఉండే హాట్ హాట్ ఫోజులే గుర్తొస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాగజిన్ కు ఎంతో గుర్తింపు ఉంది. అందమైన హీరోయిన్ల ఫోటోలు దానిపై ప్రచురితమవుతుంటాయి. హీరోయిన్లు కూడా ఒక్కసారైనా ఆ మ్యాగజిన్ కవర్ పేజ్ పై పడాలని కలలు కంటుంటారు. ఈ మ్యాగజిన్ మొదలుపెట్టినప్పటి నుండి ఇంత ఆదరణ కలిగిన మరో సినీ మ్యాగజిన్ లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి మ్యాగజిన్ ఇప్పుడు తమ తాజా పబ్లిషింగ్ విడుదల కాదని చెప్పడం నిజంగా విశేషమే. ప్లే బాయ్ మొదలుపెట్టిన 66 ఏళ్లలో ఇదే తొలిసారి ఇలా జరగడం.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భయాలు, కంటెంట్ ప్రొడక్షన్ లో ఇబ్బందులు, మ్యాగజైన్స్ సప్ప్లై చైన్ పై కరోనా ప్రభావాలు కలిపి ప్లే బాయ్ కు ఎఫెక్ట్ కొట్టాయి. దీంతో తొలి త్రైమాసికంలో వచ్చిన మ్యాగజిన్ ఈ ఏడాదికి చివరిది అంటూ బెన్ కాన్ తెలిపారు. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా ఇప్పుడు రసిక హృదయాలను కూడా బాధపెడుతోంది. మరి ఈ కరోనా మహమ్మారి నుండి ప్రపంచం ఎప్పుడు విముక్తి పొందుతుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All