
కాశీకి వెళ్లాడు కాషాయం కట్టాడు అనుకుంటున్నారేమో అదే వేడి అదే పౌరుషం.. `ఇంద్ర`లో మెగాస్టార్ చిరంజీవి చెప్పిర డైలాగ్ పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కు సరిగ్గా సరిపోతుంది. రెండేళ్ల విరామం తరువాత పవన్ సినిమా చేస్తున్నా పవన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. `పింక్` సినిమా రీమేక్‌తో మళ్లీ పవన్ కెమెరా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ ఈ సోమవారం రిలీజ్ చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఫస్టలుక్‌కి రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర బృందం ఓ స్టిల్‌ని రిలీజ్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో హంగామా అంబరాన్నంటుతోంది. ఈ ప్రకటనకు సంబంధించిన లుక్ రిలీజ్ అయిన వెంటనే హంగామా తారా స్థాయికి చేరింది.
#PSPK26 ఫస్ట్‌లుక్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ఈ న్యూస్ సోషల్ మీడియా ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌లో వుండటం విశేషం. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో కూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ లాయర్‌గా కనిపించబోతున్న విషయం తెలిసిందే కాగా ఈ చిత్రానికి `వకీల్ సాబ్` టైటిల్‌ని ఫిక్స్ చేసినట్టు తెలిసింది. రేపు అదే టైటిల్ పోస్టర్‌ని రిలీజ్ చేయబోతున్నారట.