Homeన్యూస్నీవే’ ఫణి కల్యాణ్ సరికొత్త సంచలనం – ‘జా.. జారే..’

నీవే’ ఫణి కల్యాణ్ సరికొత్త సంచలనం – ‘జా.. జారే..’

Phani Kalyan JAA JAARE Music Video Launchసినిమా సంగీతమే తప్ప మ్యూజిక్ వీడియోలు ట్రెండ్ సృష్టించడం అనేది మన దేశంలో చాలా అరుదు. అలాంటి అరుదైన ఘనతను ‘నీవే’ పాట ద్వారా సాధించాడు యువ సంగీత దర్శకుడు ఫణి కల్యాణ్. తెలుగు, తమిళ, కన్నడ తదితర భారతీయ భాషల్లో ‘నీవే’ సింగిల్ మ్యూజిక్ వీడియో సంగీత ప్రియులను ఉర్రూతలూగించింది. ఆ ఒక్క పాటతో ఫణి కల్యాణ్ యువ సంగీత ప్రియులను ఆకట్టుకున్నాడు. దక్షిణాది సంగీత సరికొత్త సంచలనం అయ్యాడు.

తాజాగా ఫణి కల్యాణ్ మరొక సింగిల్ మ్యూజిక్ వీడియో ద్వారా ప్రేక్షకులను ఉర్రూతలూగించడానికి ముందుకొచ్చాడు. అతను తాజాగా స్వరపరిచిన ‘జా.. జారే..’ మ్యూజిక్ వీడియో నేడు యూట్యూబ్ లో విడుదలయ్యింది. ఫణి కల్యాణ్ ట్విట్టర్ లో ఈ మేరకు ఒక ట్వీట్ చేస్తూ తన తాజా మ్యూజిక్ వీడియో ‘జా.. జారే..’ని తన అభిమానుల ముందుంచాడు.

- Advertisement -

అమెరికాలో స్థిరపడిన తెలుగు యువకుడు భరత్ కప్పా ఈ మ్యూజిక్ వీడియోని సమర్పించడమే కాకుండా అతనే స్వయంగా ఇందులో నటించాడు. సినిమాల మీద విపరీతమైన అభిమానం, సంగీత సాహిత్యాల పట్ల అభినివేశం ఉన్న భరత్ కప్పా ప్రధాన పాత్రలో ‘జా.. జారే..’ మ్యూజిక్ వీడియో రూపొందింది.

అంతర్జాతీయ కళాకారులు నటించగా పూర్తిగా అమెరికాలోని వివిధ లొకేషన్లలో చాలా రిచ్ గా ఈ వీడియోని చిత్రీకరించడం విశేషం. పైగా ఇది తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల కావడం మరొక విశేషం.

ఇంతవరకూ దక్షిణాది రాష్ట్రాలకే పరిమితమైన తాను ‘జా.. జారే..’ వీడియో ఆల్బమ్ ద్వారా హిందీ సంగీత ప్రియులకు కూడా చేరువ కాగలనంటూ సంగీత దర్శకుడు ఫణి కల్యాణ్ ఈ పాట విడుదల సందర్భంగా ఆకాంక్షించారు.

ఈ ఆల్బమ్ కి స్వరకర్త తానే అయినా వీడియో రూపకర్త భరత్ కప్పా అని, ఆ యువ ప్రవాస భారతీయుడి ఆలోచనాధోరణికి ‘జా.. జారే..’ అద్దం పడుతుందని ఫణి కల్యాణ్ అన్నారు. ఇది ఒక ఇన్ స్పిరేషనల్ మ్యూజిక్ సింగిల్ అని, నేటి యువతకి ఇది ఎంతో ఉత్తేజాన్ని ఇవ్వగల మ్యూజిక్ నెంబర్ అని అన్నారు.

భరత్ కప్పా ఈ వీడియో ద్వారా తెలుగు, హిందీ ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాడు. విడుదలైన కొద్ది గంటల్లోనే ‘జా.. జారే..’ ఫణి కల్యాణ్ అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చిందని, త్వరలోనే తమ ఇద్దరి కాంబినేషన్ లో మరొక మ్యూజిక్ ఆల్బమ్ రూపొందిస్తామని భరత్ కప్పా ప్రకటించారు. ఫణి కల్యాణ్ ‘నీవే’ మ్యూజిక్ వీడియో ఎంత సంచలనం సృష్టించిందో, ఇది అంతకుమించి సంచలనం సృష్టిస్తుందని భరత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెలుగు, హిందీ వెర్షన్లు యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి. ఆ వీడియోల లింకులు ఇక్కడ చూడవచ్చు.

పూర్తిగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందించిన ఈ ఆల్బమ్ కి మాథ్యూ కూలీ సినిమాటోగ్రఫీ అందించగా జోమిల్ నజారియో బర్గోస్ దర్శకత్వం వహించారు. ప్రముఖ హిందీ గీత రచయిత కృష్ణ భరద్వాజ హిందీ లిరిక్స్ అందించగా, తెలుగు పాటను వర్ధమాన గీతరచయిత ఇమ్రాన్ శాస్త్రి రాశారు. హిందీలో ఈ పాటను యాష్ గోల్చా పాడగా, తెలుగులో యాజిన్ నిజార్ అద్భుతంగా తన గళాన్ని అందించి పాటకు జీవం పోశారు. కష్టే ఫలి క్రియేషన్స్ బేనర్ లో ఈ మ్యూజిక్ వీడియో రూపొందింది.

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All