Homeటాప్ స్టోరీస్రాత్రి 8 గంట‌ల‌కు ప్ర‌ధాని ఏం చెప్ప‌బోతున్నారు?

రాత్రి 8 గంట‌ల‌కు ప్ర‌ధాని ఏం చెప్ప‌బోతున్నారు?

రాత్రి 8 గంట‌ల‌కు ప్ర‌ధాని ఏం చెప్ప‌బోతున్నారు?
రాత్రి 8 గంట‌ల‌కు ప్ర‌ధాని ఏం చెప్ప‌బోతున్నారు?

ఈ నెల 17తో దేశ వ్యాప్తంగా రెండ‌వ ద‌ఫా విధించిన లాక్‌డౌన్ ముగియ‌బోతోంది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి ప్ర‌ధాని మోదీ మంగ‌ళ‌వారం రాత్రి 8 గంట‌ల‌కు జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించ‌బోతున్నార‌ని ప్ర‌ధాని కార్యాల‌యం వెల్ల‌డించింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాబోతోంది? .. పెరుగుతున్న క‌రోనా పిజిటివ్ కేసుల దృష్ట్యా మ‌రో ద‌ఫా లాక్ డౌన్‌ని పొడిగించ‌బోతున్నారా?  లేక స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో మిన‌హా లాక్ డౌన్ ఎత్తేస్తారా అన్న‌ది ప్ర‌తి  ఒక్క‌రిలోనూ ఆస‌క్తిగా మారింది.

అయితే లాక్‌డౌన్ స‌డ‌లింపులు,  క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌పై ప్ర‌ధాని కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని రాత్రి 8 గంట‌ల‌కు చేయ‌బోయే ప్ర‌సంగంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. దేశంలో క‌రోనా క‌ట్ట‌డిపై తీసుకున్న నివార‌ణ చ‌ర్య‌లు ఎలా వున్నాయి. ఎలాంటి స‌త్ఫ‌లితాల‌ని నిచ్చాయ‌నే విష‌యాలని ప్ర‌ధాని త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించే అవ‌కాశం వుంద‌ని చెబుతున్నారు. నిన్న వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాని ప్ర‌త్యేకంగా వీడియో కాన్ఫ‌రెన్స్‌ని నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే.

- Advertisement -

ఈ స‌మావేశంలో అత్య‌ధిక శాతం మంది ముఖ్య‌మంత్రులు లాక్‌డౌన్ పొడిగించాల‌ని, రైళ్ల రాక‌పోక‌ల్ని అప్పుడే పున‌రుద్ధ‌రించొద్ద‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. ఆర్థిక వ్య‌వ‌స్థ లాక్‌డౌన్ కార‌ణంగా ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లోకి వెళ్లిపోయింది. దీనిపై తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి ఈ సం్ద‌ర్భంగా అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ప్ర‌ధానికి వెల్ల‌డించిన‌ట్టు తెలిసింది. క‌రోనాని ఎదుర్కొనే విష‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల్లో ఎలాంటి లోటు పాట్లు లేకుండా ముందుకు వెళ్లేలా సూచ‌న‌లు, స‌ల‌హాలు ఈ నెల 15 లోపు  ఇవ్వాల‌ని ప్ర‌ధాని అన్ని రాష్ట్రాల సీఎంల‌కు సూచించిన‌ట్టు తెలిసింది. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రులు ఏం చెప్పారు? ద‌ఆనికి ప్ర‌ధాని ఏం చెప్ప‌బోతున్నార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All