Homeటాప్ స్టోరీస్మే 3 వ‌ర‌కు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ - ప్ర‌ధాని మోదీ

మే 3 వ‌ర‌కు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ – ప్ర‌ధాని మోదీ

మే 3 వ‌ర‌కు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ - ప్ర‌ధాని మోదీ
మే 3 వ‌ర‌కు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ – ప్ర‌ధాని మోదీ

దేశ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఖ‌చ్చితంగా లాక్‌డౌన్ ని పొడిగిస్తార‌ని అంతా ఊహించిన విధంగానే ప్ర‌స్తుతం అమ‌లులో వున్న లాక్‌డౌన్‌ను మే 3 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్టు తాజాగా వెల్ల‌డించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం నానాటికీ పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ కిన నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని ప్ర‌ధాన వెల్ల‌డించారు. ‌లాక్‌డౌన్ వ‌ల్ల ప్ర‌జ‌లు ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారని ఈ సంద‌ర్భంగా తెలిపారు.

అయినా దేశ ప్ర‌యోజ‌నాల‌కు దృష్టిలో పెట్టుకుని అంద‌రూ స‌హ‌నం వ‌హించారు. దేశం కోసం ప్ర‌తీ ఒక్క‌రూ సైనికుల్లా పోరాడుతున్నార‌ని, వారికి ధ‌న్య‌వాదాల‌ని చెప్పారు. భార‌త రాజ్యాంగ పీఠిక‌లోని `భార‌త ప్ర‌జ‌ల‌మైన మేము` అన్న స్ఫూర్తిని చాటార‌ని కొనియాడారు. నేడు అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న సేవ‌ల‌ను గుర్తుచేశారు. నేడు దేశాన్ని మ‌హ‌మ్మారి నుంచి కాపాడు కోవ‌డం కోసం ఐక్య‌త‌ను చాట‌డ‌మే అంబేద్క‌ర్‌కు మ‌మిచ్చే గొప్ప‌ నివాళి అన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్ర‌జ‌లు పండ‌గ‌లు సాదీసీదాగా జ‌రుపుకోవాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయన్నారు.

- Advertisement -

ప్ర‌ధాన ప్ర‌సంగంలోని కీల‌కాంశాలు:

దేశంలో 500 కేసులు వున్న‌ప్పుడే లాక్‌డౌన్ నిర్ణ‌యం తీసుకున్నాం. ప్ర‌జ‌ల స‌హ‌కారంతోనే వైర‌స్ వ్యాప్తిని నియంత్రిస్తున్నాం. మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డంలో కేంద్రం స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌లు రూపొందించి అమ‌లు చేయ‌క‌పోతే ప‌రిస్థితులు మ‌రింత ద‌య‌నీయంగా మారేవి.

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఎదుర్కొంటున్న ప‌రిస్థితులు బ‌ట్టి చూస్తే మ‌నం అనుస‌రిస్తున్న మార్గం స‌రైన‌దే. ప్ర‌పంచ దేశాలు ఈ రోజు భార‌త్ వైపు చూస్తున్నాయి. అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ప్ప‌టికీ మ‌హమ్మారి పంజా విసురుతోంది. ప్ర‌పంచ దేశాల‌కు స‌వాల్ విసురుతోంది. ఈ త‌రుణంలో ప్ర‌జ‌ల క‌ష్టాల్ని ఎలా త‌గ్గించాలి. తీవ్ర‌త‌ను ఎలా క‌నిష్టానికి ప‌రిమితం చేయాలి అని రాష్ట్రాల‌తో నిరంత‌రం చ‌ర్చ‌లు  జ‌రిపి లాక్ డౌన్ పొడిగింపు నిర్ణ‌యాన్ని తీసుకున్నాం అని పేర్కొన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All