Homeటాప్ స్టోరీస్హిందీలో ప్లాప్ మరి తమిళ్ లో ఏమౌతుందో

హిందీలో ప్లాప్ మరి తమిళ్ లో ఏమౌతుందో

pellichupulu flop in bollywoodతెలుగులో సంచలన విజయం సాధించిన చిత్రం ” పెళ్లి చూపులు ” . ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన పెళ్లి చూపులు చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటుగా ప్రేక్షకుల రివార్డులు , ప్రభుత్వ అవార్డులు లభించాయి . హీరోగా విజయ్ దేవరకొండ ఎస్టాబ్లిష్ అయ్యాడు అలాగే దర్శకుడిగా దాస్యం తరుణ్ భాస్కర్ టాలెంటెడ్ డైరెక్టర్ తెలుగుతెరకు పరిచయమయ్యాడు . కట్ చేస్తే పెళ్లి చూపులు చిత్రాన్ని పలు బాషలలో రీమేక్ చేయడానికి పోటీపడ్డారు . అలా హిందీలో” మిత్రోన్ ” టైటిల్ తో సినిమా రూపొందింది , గతవారం విడుదల అయ్యింది కూడా అయితే ఈ సినిమా హిందీలో ప్లాప్ అయ్యింది . తెలుగునాట సంచలనం సృష్టించిన పెళ్లి చూపులు చిత్రం హిందీలో ప్రేక్షకులను మాత్రం కనెక్ట్ కాలేకపోయింది .

ఇక ఇదే పెళ్లి చూపులు చిత్రాన్ని తమిళ్ లో కూడా రీమేక్ చేయడానికి హక్కులు తీసుకున్నాడు దర్శక నిర్మాత గౌతమ్ వాసుదేవ మీనన్ . ఇంకా ఈ సినిమా ఎప్పుడు మొదలౌతుందో తెలీదు కానీ మరి తెలుగులో లాగా పెద్ద హిట్ అవుతుందా ? లేక హిందీలో లాగా ప్లాప్ అవుతుందా ? అన్నది చూడాలి . ఇక తరుణ్ భాస్కర్ విషయానికి వస్తే రెండో సినిమా ఈ నగరానికి ఏమైంది అంటూ వచ్చాడు కానీ ప్లాప్ అయ్యింది . హీరోగా మాత్రం విజయ్ దేవరకొండ సంచలనాలు సృష్టిస్తున్నాడు .

- Advertisement -

English Title: pellichupulu flop in bollywood

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All