Homeటాప్ స్టోరీస్నిఖిల్ తో పెళ్లి చూపులు డైరెక్టర్

నిఖిల్ తో పెళ్లి చూపులు డైరెక్టర్

pelli choopulu director next movie with hero nikhilవరుస విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్ తన తదుపరి చిత్రాన్ని పెళ్లి చూపులు డైరెక్టర్ తో చేయనున్నట్లు తెలుస్తోంది . ప్రస్తుతం కిర్రాక్ పార్టీ చిత్రంలో నటిస్తున్న నిఖిల్ ఆ చిత్రం రిలీజ్ కి సిద్ధం కావడంతో తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడు . పెళ్లి చూపులు చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన దాస్యం తరుణ్ భాస్కర్ తన రెండో చిత్రాన్ని ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో చేస్తున్నాడు . ఆ సినిమాని వేసవిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

 

- Advertisement -

రెండో సినిమా కంప్లీట్ కాకముందే మూడో సినిమాకు సన్నాహాలు ప్రారంభించాడు తరుణ్ భాస్కర్ , నిఖిల్ ని కలిసి ఓ కథ చెప్పడం అది నిఖిల్ కు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచాడట ! ఇంకేముంది ఈ ఏడాది లోనే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది . నిఖిల్ – దాస్యం తరుణ్ భాస్కర్ ల కాంబినేషన్ అంటే ఎంతో కొంత క్రేజ్ ఏర్పడటం సహజమే కదా !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All