Homeటాప్ స్టోరీస్పాయ‌ల్ రాజ్‌పుత్ మూవీ వ‌చ్చేది అప్పుడే!

పాయ‌ల్ రాజ్‌పుత్ మూవీ వ‌చ్చేది అప్పుడే!

Payal rajput`s 5Ws to release in january
Payal rajput`s 5Ws to release in january

`Rx100`బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్ స్పీడు పెంచేసింది. త‌నని వెతుక్కుంటూ వ‌చ్చిన ప్ర‌తీ ఆఫ‌ర్‌ని స‌ద్వినియోగం చేసుకుంటూ వ‌రుస చిత్రాల‌తో బిజీగా మారిపోయింది. థియేట‌ర్స్ యూసి వేయ‌డంతో ఓటీటీ కోసం `అన‌గ‌న‌గ ఓ అతిథి`లో న‌టించిన పాయ‌ల్ మ‌హిళా ప్ర‌ధాన చిత్రాల్లో న‌టిస్తోంది. తాజాగా ఆమె న‌టిస్తున్న చిత్రం `5Ws`(who, what, when, wheren why) 5 డ‌బ్ల్యూస్ ఎవ‌రు?, ఏమీటి? ఎప్పుడు? ఎక్క‌డ‌? ఎందుకు?) సాధార‌ణ ప్ర‌శ్న‌లు.. సాధార‌ణ స‌మాధానాలు అనేది ఉప‌శీర్ష‌క‌.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ వ‌ద్ద ప‌లు చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. కైవ‌ల్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీ‌మ‌తి యశోద ఠాకోర్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జ‌న‌వ‌రిలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

- Advertisement -

ఇన్వెస్టిగేటివ్ మిస్ట‌రీ డ్రామా చిత్ర‌మిది. పాయ‌ల్ రాజ్‌పుత్‌ని ఈ మూవీలో కొత్త కోణంలో ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. న‌టిగా ఆమెకు మంచి గుర్తింపుని తీసుకొస్తుంద‌ట‌. ఒక పోలీస్ ఆఫీస‌ర్ జీవితంలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సాంకేతికంగా ఉన్న‌తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామ‌ని నిర్మాత‌లు ప్ర‌ణ‌దీప్ ఠాకోర్‌, య‌శోద ఠాకోర్ చెబుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All