
సంచలన చిత్రం `Rx100` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది ఉత్తరాది భామ పాయల్ రాజ్‌పుత్. ఈ మూవీ తో వచ్చిన క్రేజ్‌తో నిత్యం సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన ఫొటోల్ని, వీడియోల్ని షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో వుంటోంది పాయల్. వెంకీ మామ, డిస్కోరాజా చిత్రాల తరువాత తెలుగులో ఆ స్థాయి అవకాశాన్ని పొందలేకపోతోంది.
తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన పాయల్ పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. `Rx100`, Rdx లవ్ చిత్రాలతో గ్లామర్ డాల్‌గా పేరు తెచ్చుకున్న పాయల్‌కు టాలీవుడ్‌లో ఇద్దరు హీరోలంటే క్రష్ వుందట. ఎప్పటికైనా ఈ ఇద్దరితో కలిసి నటిస్తానని, ఆ రోజు కోసం ఎదురుచూస్తున్ననని తెలిపింది. పాయల్ మనసు పడ్డ ఆ ఇద్దరు హీరోలు మరెవరో కాదు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, విజయ్ దేవరకొండ.
ఈ జనరేషన్‌కి ప్రభాస్ బాలీవుడ్ హీరో షార్‌ఖ్ ఖాన్ లాంటి వాడని, విజయ్ దేవరకొండ కూడా అదే స్థాయి క్రేజ్‌ని సొంతం చేసుకున్నారని, భవిష్యత్తులో ఈ ఇద్దరితో కలిసి నటించాలని వుందని స్పష్టం చేసింది. ఇటీవల తను ఇండియన్ 2, పుష్ప చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో నటించనున్నానని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తాను ప్రత్యేక గీతాల్లో నటించనని క్లారిటీ ఇచ్చింది.