Homeటాప్ స్టోరీస్డబ్బు కోసం కక్కూర్తి పడి పాయల్ కెరీర్ ను ప్రమాదంలో పడేసుకుందిగా

డబ్బు కోసం కక్కూర్తి పడి పాయల్ కెరీర్ ను ప్రమాదంలో పడేసుకుందిగా

డబ్బు కోసం కక్కూర్తి పడి పాయల్ కెరీర్ ను ప్రమాదంలో పడేసుకుందిగా
డబ్బు కోసం కక్కూర్తి పడి పాయల్ కెరీర్ ను ప్రమాదంలో పడేసుకుందిగా

ఆరెక్స్ 100 చిత్రంతో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా యూత్ లో ఆమె పట్ల ఫాలోయింగ్ అదిరిపోయింది. ఇదే దెబ్బతో ఆమె వెంకటేష్, రవితేజ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు పట్టేసింది. అయితే తనను తాను ఎక్కువ అంచనా వేసుకుందో ఏమో కానీ కెరీర్ ఆరంభంలోనే బోల్డ్ అండ్ హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ కు ఓకే చెప్పింది.

అదే నిన్న విడుదలైన ఆర్డీఎక్స్ లవ్. కేవలం పాయల్ అందాలను నమ్ముకుని ఈ సినిమా తీశారన్న విషయం టీజర్ తోనే అర్ధమైంది. సినిమాలో విషయం లేదన్న విషయం ట్రైలర్ తో కన్ఫర్మ్ అయింది. అయితే సినిమా చూసాక ప్రేక్షకులందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. నాసిరకం సీన్లతో, జుగుప్స కలిగించే ఆలోచనలతో ఆర్డీఎక్స్ లవ్ చిత్రం హింస పెడుతుంది.

- Advertisement -

గ్లామర్ షో వల్ల బి, సి సెంటర్లలో ఎంతో కొంత వసూళ్లు తెచుకోవచ్చేమో కానీ ఈ చిత్రం చేయడం వల్ల పాయల్ కెరీర్ కు డ్యామేజ్ జరిగిందన్నది మాత్రం వాస్తవం. ఓ వైపు రవితేజ, వెంకటేష్ పక్కన సినిమాలు చేస్తూ డబ్బుకు కక్కూర్తి పడి ఇలాంటి సినిమాలు చేయడం అవసరమా అంటూ బహిరంగంగానే పాయల్ ను విమర్శిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All