
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకుని ఇటీవల విడిపోయిన విషయం తెలిసిందే. వీరికి అకీరా, ఆద్య ఇద్దరు పిల్లలు, అకీరా నందన్ ని హీరోగా పరిచయం చేయాలని మెగా ఫ్యామిలీ ప్లాన్ చేస్తోందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అకీరా కూడా వరుణ్‌తేజ్ తరహాలో ఆరడుగుల ఆజాను బావుడిలా తండ్రిని మించిన తనయుడిగా కనిపిస్తున్నాయి. ఇటీవల బయటికి వచ్చిన ఫొటోల్ని చూసిన ఫ్యాన్స్ అంతా ఇదే మాట అంటున్నారు.
ఇదిలా వుంటే పవర్‌స్టార్ ముద్దుల తనయ ఆద్యా ఇప్పుడు సోషల్ మీడియా అండ్ యూట్యూబ్‌లోవైరల్‌గా మారింది. అకీరాను మించి ఆకట్టుకుంటోంది. ఆద్యాకు ఇప్పుడు పదేళ్లు. ఇటీవల రేణు దేశాయ్ ఇచ్చిన ఓ పాటని లైవ్‌లో పాడి ఆశ్చర్య పరిచిన ఆద్యా ఇప్పడు ఏకంగా తన యాక్టింగ్ స్కల్స్‌ని బయటపెట్టి నెటిజన్స్‌తో పాటు పవర్‌స్టార్ ఫ్యాన్స్ అవాక్కయ్యేలా చేసింది.
ఆద్య యాక్టింగ్ స్కిల్స్‌ని చూపించడం కోసం ఓ చిన్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది రేణు దేశాయ్. ఇప్పుడది వైరల్‌గా మారి మెగా ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది. ఇంతక ఆ క్లిప్‌లో ఏముందంటే ఆద్య ఒకేసారి ద్విపాత్రాభినయం చేసింది. ఈ వీడియోకు రచన, దర్శకత్వం, యాక్టింగ్ అన్నీ ఆద్యానే అని రేణుదేశాయ్ వెల్లడించింది. దీంతో మెగా ఫ్యాన్ ఈ వీడియోలో ఆద్య నటనని చూసి కామెంట్‌లు పెడుతున్నారు. కొంత మంది సూపర్ అంటే మరి కొంత మంది మల్టీ టాలెంటెడ్ అని అభినందిస్తున్నారు. ఇదిలా వుంటే రేణు దేశాయ్ మళ్లీ నటించడానికి రెడీ అంటూ ఇటీవల సంకేతాలిచ్చిన విషయం తెలిసిందే.