Homeటాప్ స్టోరీస్ప‌వ‌న్ - హ‌రీష్‌శంక‌ర్ టైటిల్ ఇదేనా?

ప‌వ‌న్ – హ‌రీష్‌శంక‌ర్ టైటిల్ ఇదేనా?

ప‌వ‌న్ - హ‌రీష్‌శంక‌ర్ టైటిల్ ఇదేనా?
ప‌వ‌న్ – హ‌రీష్‌శంక‌ర్ టైటిల్ ఇదేనా?

స్టార్ హీరో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు ఈ బుధ‌వారం హోరెత్త‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇదే రోజు ప‌వ‌న్ కొత్త చిత్రాల‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్‌లు రాబోతున్నాయి. ఫ్యాన్స్ కూడా ఇదే విష‌యంపై చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకే రోజు ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి మూడు స‌ర్‌ప్రైజ్‌లు రానున్న‌ట్టు తెలుస్తోంది. అయితే అందులో ప్ర‌ధానంగా రెండు చిత్రాల నుంచి క్రేజీ అప్ డేట్‌ల‌ని మేక‌ర్స్ అందించ‌బోతున్నారు.

అందులో ఒక‌టి `వ‌కీల్ సాబ్‌`. బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్` ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌ని బుధ‌వారం రిలీజ్ చేస్తున్నామంటూ చిత్ర బృందం ఇప్ప‌టికే ప్ర‌క‌టించేసింది. ఇక దీంతో అందిరి చూపు ప‌వ‌న్ 28వ చిత్రంపై ప‌డింది. ఇదే రోజు ప‌వ‌న్ 28వ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ కూడా రాబోతోంది.

- Advertisement -

హ‌రీష్‌శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపీనాథ్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ చిత్ర టైటిల్‌ని ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ మూవీ కోసం హ‌రీష్‌శంక‌ర్ ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ని ఎంపిక చేశార‌ట‌. `ఉస్తాద్‌` అనే టైటిల్‌ని ఈ మూవీ కోసం ఫైన‌ల్ చేశార‌ని, అదే టైటిల్‌ని రేపు ( బుధ‌వారం) ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. టైటిల్ మాసీవ్‌గా వుండ‌టంతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు చిత్ర వ‌ర్గాల స‌మాచారం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All