Homeటాప్ స్టోరీస్లీకులపై గుసా అయిన పవన్

లీకులపై గుసా అయిన పవన్

Pawan serious on his movie leaks
Pawan serious on his movie leaks

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇవ్వడమే కాకుండా ఎప్పుడూ లేనంత స్పీడ్ గా సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాల షూటింగ్స్ మొదలయ్యాయి. మరో సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇంకో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ముందుగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న పింక్ రీమేక్ షూటింగ్ స్పాట్ నుండి కొన్ని లీక్స్ వచ్చిన విషయం తెల్సిందే. ఇటీవలే పెద్ద సినిమాలకు ఇలా లీకుల బెడద చాలా ఎక్కువగా ఉంది. కొన్ని షూటింగ్ స్పాట్ నుండి పిక్స్, చిన్న చిన్న వీడియో బిట్స్ వస్తుంటే, మరి కొన్ని సినిమాలకు ఎడిటింగ్ రూమ్ నుండి లీకులు వస్తున్నాయి. సినిమాపై ఎంత బజ్ ఉంటే అంత ఎక్కువగా ఈ లీకులు ఉంటున్నాయి. ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ వీడియో లీకైన విషయం తెల్సిందే. ఆ లీక్ తో షాక్ కు గురైన ఆర్ ఆర్ ఆర్ టీమ్ నష్ట నివారణ చర్యలకు దిగి, ఆపై మరింత పటిష్టమైన ఏర్పాట్లు చేసారు.

ఇప్పుడిక పింక్ రీమేక్ వంతు. పవన్ కళ్యాణ్ నటించిన సీన్ కు సంబంధించిన చిన్న బిట్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ విషయం పవన్ కు తెలిసి టీమ్ పై గుస్సా అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపై పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చిత్ర టీమ్ ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఎలా ఉంటుందా అని అందరికీ ఆసక్తి ఉంది. ఈ నేపథ్యంలో కొందరు ఔత్సాహికులు ఇలాంటి లీకులకు పాల్పడి ఉండొచ్చు.

- Advertisement -

అయితే ఈ చర్యతో పింక్ రీమేక్ టీమ్ కూడా అప్రమత్తమైంది. సెల్ ఫోన్స్ ను సెట్ లోకి అనుమతించట్లేదు. ఔటర్స్ ను కూడా షూటింగ్ స్పాట్ దగ్గర్లోకి రానివ్వట్లేదు. ఇలా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా లీకులు మాత్రం ఏదోలా జరుగుతుండడం ప్రతీ చిత్ర యూనిట్ ను ఇబ్బంది పెడుతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All