Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటే తప్పేంటి.?

పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటే తప్పేంటి.?

పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటే తప్పేంటి.?
పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటే తప్పేంటి.?

పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటే తప్పేంటి.? ఇప్పుడు ఆయన అభిమానులతో పాటు కోట్లమంది ప్రజల మనసుల్లో వస్తున్న ప్రశ్న ఇదే. ఎందుకంటే భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది నటీనటులు తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు, రాజకీయాలు కంటిన్యూ చేస్తూ సినిమాలు చేశారు. సినిమాలు చేసుకుంటూ రాజకీయాల్లో కూడా రాణించారు. మరి ఇంత మంది తమ వ్యక్తిగత వృత్తి అయినటువంటి సినిమాలు చేసుకుంటూ, రాజకీయాలు చేస్తే తప్పు లేకపోగా.. కేవలం పవన్ కళ్యాణ్ లేదా చిరంజీవి గారు లేదంటే మెగా ఫ్యామిలీని మాత్రం ఎందుకు స్వార్థ రాజకీయాల కోసం అనేకమంది వేలెత్తి చూపిస్తున్నారు..? అనే ప్రశ్న గురించి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.

ఒకసారి మనం గతంలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఖుషి అనే ఇండస్ట్రీ హిట్ సినిమా తర్వాత ఆయన జానీ అనే ఒక సినిమా చేశారు. ఖుషి సినిమా స్వాగ్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆ సినిమా అంతగా రుచించలేదు. ఆ సినిమా ద్వారా నష్టపోయినటువంటి డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు కు ఆయన తన ఆస్తులు అమ్మి వాళ్ళకి సెటిల్ చేసిన సందర్భం ఇప్పటికీ కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు చెప్పుకుంటూ ఉంటారు. సౌత్ ఇండియాలో సినిమా ఫ్లాప్ అయితే రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వడం తో సహా డిస్ట్రిబ్యూటర్లను, ఎగ్జిబిటర్లను ఆదుకునే ఏకైక వ్యక్తి రజనీకాంత్ తర్వాత పవన్ కళ్యాణ్ అన్న విషయం చాలామందికి తెలుసు.

- Advertisement -

మరి పవన్ కళ్యాణ్ గారి గత సినిమాలు చూసినట్లయితే కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యాయి. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన కమిట్మెంట్ ల ప్రకారం సినిమాలు కొనసాగించి, సంవత్సరానికి ఒక సినిమా అయినా చేస్తేనే.. అటు ఇండస్ట్రీ పరంగా ఆయన పై ఆధారపడ్డ వందలాది వేలాది కుటుంబాలతో పాటు ఆయన ఖర్చులు లేదా జనసేన పార్టీకి కావలసినటువంటి ఆర్థిక వనరులు లభిస్తాయి.

మనందరికీ బాగా తెలిసిన మరొక విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వాణిజ్య ప్రకటనలకు ప్రచారాలు చేయరు. గత ఎన్నికలలో కూడా ఏ రాజకీయ పార్టీకి ఆయన ప్రచారం చేయలేదు. ప్రస్తుత రాజకీయ నాయకులకు ఉన్నట్లు ఆయనకు సొంత వ్యాపారాలు కానీ లేకపోతే ఆయన సొంత మనుషులు చేసే వ్యాపారాలలో పరోక్ష పెట్టుబడులు కూడా లేవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు సమాజానికి ఉపయోగపడే మంచి సందేశాత్మక మైనటువంటి సినిమాలు చేస్తూ ప్రజలకు నాలుగు మంచి మాటలు చెప్తే తప్పేంటి.? ఇది సగటు తెలుగు సినిమా అభిమానులతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క ప్రశ్న. మరి ప్రతిదాన్ని రాజకీయ స్వార్థానికి ఉపయోగించుకోవడానికి అలవాటు పడిన సదరు రాజకీయ పార్టీలో వివేకంతో ఆలోచిస్తే ఇప్పటికైనా బాగుంటుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All