
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి పలు సినిమాలను సెట్స్ పై ఉంచుతున్నాడు. వకీల్ సాబ్ ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు ఒకటి కాగా మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ మరొకటి.
జూన్ కల్లా అయ్యప్పనుమ్ కోశియుమ్ లో తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేయనున్నాడు పవన్. హరిహర వీరమల్లులో నటిస్తూనే దసరా నుండి తన నెక్స్ట్ సినిమాను కూడా పట్టాలెక్కించనున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాకు పవన్ పచ్చ జెండా ఊపిన విషయం తెల్సిందే.
ఇక ఈ సినిమా కోసం దసరా నుండి నెలకు 10-15 రోజుల చొప్పున పవన్ డేట్స్ ను కేటాయించాడట. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు క్రిష్ తో చిత్రం జనవరి 2022లో విడుదల కానుంది. హరీష్ శంకర్ సినిమా విషయానికొస్తే ఈ చిత్రంలో పవన్ ఐబీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.