Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ అప్డేట్స్ తో మార్మోగిన సోషల్ మీడియా

పవన్ కళ్యాణ్ అప్డేట్స్ తో మార్మోగిన సోషల్ మీడియా

పవన్ కళ్యాణ్ అప్డేట్స్ తో మార్మోగిన సోషల్ మీడియా
పవన్ కళ్యాణ్ అప్డేట్స్ తో మార్మోగిన సోషల్ మీడియా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం సినిమాల పరంగా చాలా బిజీగా ఉన్నాడు పవన్. భీమ్లా నాయక్ తో పాటు హరి హర వీర మల్లు కూడా షూటింగ్ దశల్లో ఉన్నాయి. అలాగే మరో రెండు ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ నాలుగు చిత్రాల అప్డేట్స్ ను విడుదల చేసారు. ముందుగా ఉదయం భీమ్లా నాయక్ నుండి మొదటి సింగిల్ ను విడుదల చేసారు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ను పైకి లేపుతూ సాగిన ఈ పాట ఫోక్ మెలోడీ నేపథ్యంలో సాగింది. దీనికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

- Advertisement -

అలాగే హరిహర వీర మల్లు నుండి విడుదల తేదీకు సంబంధించిన అప్డేట్ ను ఇచ్చారు. ఏప్రిల్ 29, 2022న ఈ సినిమా విడుదల కానుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకు సంబంధించి ప్రీ లుక్ పోస్టర్ తో సరిపెట్టారు. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాను పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. ఇలా ఫుల్ అప్డేట్స్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఈరోజంతా పండగే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All