Homeట్రేడ్ న్యూస్ఏపీలో పలుచోట్ల భీమ్లా నాయక్ సినిమా ప్రదర్శనను నిలిపివేసిన థియేటర్ యాజమాన్యాలు

ఏపీలో పలుచోట్ల భీమ్లా నాయక్ సినిమా ప్రదర్శనను నిలిపివేసిన థియేటర్ యాజమాన్యాలు

భీమ్లా నాయక్ ఫై ఏపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు..
భీమ్లా నాయక్ ఫై ఏపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు..

ఏపీలో మరోసారి థియేటర్స్ రగడ మొదలైంది. రద్దైన జీవో 35 ప్రకారమే సినిమా టికెట్స్ అమ్మాలంటూ అధికారులు థియేటర్స్ యాజమాన్యాల ఫై ఒత్తిడి తేవడంతో భీమ్లా నాయక్ సినిమా ప్రదర్శనను పలుచోట్ల నిలిపివేశారు. రూ, 5 , రూ.10 రూపాయలతో షోస్ నడిపితే కనీసం వాచ్ మెన్ జీతం కూడా ఇవ్వలేమని స్వచ్ఛదంగా థియేటర్స్ ను వచ్చేనెల 13 వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. దీంతో పవన్ అభిమానులు ఆందోళన చేపట్టారు. జగన్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున రోడ్ల ఫై నినాదాలు చేస్తున్నారు. ఈ ఘటన మైలవరం నారాయణ థియేటర్ లో చోటుచేసుకుంది.

అలాగే గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం లో ‘భీమ్లా నాయక్’ సినిమా కు అడ్డంకులు ఏర్పడ్డాయి. కొల్లూరు లో భీమ్లా నాయక్ సినిమా వేస్తున్న సినిమా ధియేటర్ కి బీఫామ్ లేదని అధికారులు షోలు మొత్తం రద్దు చేసిశారు. సినిమా రద్దు చేయటంతో బస్టాండ్ సెంటర్లో బైఠాయించి ఆందోళన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మార్వో కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇక అనంతపురం తాడిపత్రిలో భీమ్లానాయక్ సినిమా ప్రదర్శిస్తున్న లక్ష్మీ నారాయణ థియేటర్ లో కుర్చీల్ని ధ్వంసం చేశారు. సినిమాను సరిగా ప్రదర్శించక పోవడం… సౌండ్ సరిగా రాకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ కుర్చీలు ధ్వంసం చేసి డోర్లు బద్దలుకొట్టారు. మొత్తం మీద జగన్ అనుకున్నట్లే భీమ్లా నాయక్ కు అడ్డంకులు ఏర్పడ్డాయి.

- Advertisement -

మరోపక్క సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ లో రోజుకు ఐదు షోస్ కు అనుమతి రావడం తో కలెక్షన్లు రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All