
ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పరుచూరి వెంకటేశ్వరరావుకు భార్యా వియోగం. పరుచూరి వెంకటేశ్వరరావు సతీమణి విజయలక్ష్మి (74) ఈ రోజు ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
పరుచూరి గోపాలకృష్ణ భార్య మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. పరుచూరి వెంకటేశ్వరరావు గత కొన్నేళ్లుగా సోదరుడు పరుచూరి వెంకటేశ్వరరావుతో కలిసి పరుచూరి బ్రదర్స్ పేరుతో పలు చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. వందల చిత్రాలకు మాటలు రాశారు. కథలు అందించారు.