Homeటాప్ స్టోరీస్మెగాస్టార్ ఆధ్వ‌ర్యంలో సీసీసీ ఏర్పాటు!

మెగాస్టార్ ఆధ్వ‌ర్యంలో సీసీసీ ఏర్పాటు!

మెగాస్టార్ ఆధ్వ‌ర్యంలో సీసీసీ ఏర్పాటు!
మెగాస్టార్ ఆధ్వ‌ర్యంలో సీసీసీ ఏర్పాటు!

క‌రోనా వైర‌స్ క‌ర‌ణంగా చాలా మంది జీవితాలు రోడ్డున ప‌డుతున్నాయి. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌క ముందే ఎంతో మంది సాఫ్ట్‌వేర‌/ ఉద్యోగుల జీవితాలు దుర్భ‌రంగా మారాయి. చాలా మందిని ప‌లు సంస్థ‌లు తీసేశాయి. కొంత మందిని వ‌ర్క్ ఫ్రం హోమ్ అంటూ ఇళ్ల‌కు పంపించేశారు. క‌రోనా వైర‌స్ తీవ్ర‌త పెరిగిపోవ‌డంతో సినిమా షూటింగ్‌లు ఆపేశారు.. సినిమా థియేట‌ర్లు మూసేశారు. దీంతో ఉపాది లేక అల్లాడుతున్న సినీ కార్మికుల కోసం నిర్మాత‌లు, హీరోలు, ద‌ర్శ‌కులు స్పందిస్తూ విరాళాలు ప్ర‌క‌టిస్తున్నారు.

దీంతో క‌రోనా క్రైసిస్ చారిటీ మ‌న కోసం పేరుతో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో చారిటీని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ ` ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ సృష్టిస్తున్న క‌ల‌క‌లాన్ని మ‌న‌మంతా ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా చూస్తున్నాం. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన శ్రామికులు చాలా ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. ఎలాంటి విప‌త్తులు సంభ‌వించినా తామున్నామంటూ ఇండ‌స్ట్రీ వర్గాలు ముందుకొస్తుంటాయి. మ‌న సోద‌ర కార్మికుల కోసం తానున్నాన‌ని ముందుగా చిరంజీవి ముందుకొచ్చారు. ఆయ‌న ఆధ్వర్యంలో నేను, సురేష్‌బాబు, ఎన్‌,శంక‌ర్‌, దామోద‌రప్ర‌సాద్ క‌లిసి ఓ క‌మిటీగా ఏర్పాటై సీసీసీ సంస్థ ద్వారా కార్మికుల సంక్షేమానికి ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించాం. దీనికి ఎన్టీఆర్ 25, మ‌హేష్ 25 ల‌క్ష‌లు ప్ర‌క‌టించారు` అని తెలిపారు.

- Advertisement -

ద‌ర్శ‌కుల సంఘం అధ్య‌క్షుడు ఎన్. శంక‌ర్ మాట్లాడుతూ `సీసీసీ క‌మిటీకి చైర్మ‌న్‌గా చిరంజీవిగారు వ్య‌వ‌హ‌రిస్తారు. స‌భ్యులుగా త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ, సురేష్‌బాబు, నేను, దామోద‌రప్ర‌సాద్, సి.క‌ల్యాణ్‌, బెనర్జీ స‌భ్యులుగా వుంటాం. వీరితో పాటు డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్‌, గీతా ఆర్ట్స్ బాబు, కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌, కొమర వెంక‌టేష్, ఫెడ‌రేష‌న్ కు సంబంధించిన కార్మిక సంఘాల నాయ‌కులు ఇందులో భాగ‌స్వాముల‌వుతారు` అని తెలిపారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All