Homeటాప్ స్టోరీస్మందు పార్టీలో రెచ్చిపోయారట

మందు పార్టీలో రెచ్చిపోయారట

Parineeti chopra joins in priyanka chopra's bachelor partyవచ్చేనెలలో పెళ్లి జరగబోతోంది కాబట్టి బ్యాచిలరెట్ పార్టీ ఇచ్చిందట ప్రియాంక చోప్రా . నిక్ జోనాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే . డిసెంబర్ 1న జోధ్ పూర్ లో ఈ వివాహం జరుగనుంది దాంతో బ్యాచిలరెట్ పార్టీ ని నెదర్లాండ్ లోని ఆమ్ స్టర్ డ్యామ్ లో ఇచ్చింది ప్రియాంక చోప్రా . ఈ పార్టీకి తన చెల్లెలు అయిన హీరోయిన్ పరిణీతి చోప్రా కూడా హాజరయ్యింది . ఇక ఆ పార్టీలో ఫుల్లుగా మద్యం తాగేసి రచ్చ రచ్చ చేశారట అక్కాచెల్లెళ్లు . పరిణీతి చోప్రా , ప్రియాంక చోప్రా లు మాత్రమే కాదు ఇంకా చాలామంది అమ్మాయిలు పాల్గొన్నారట ఈ పార్టీలో . వీర లెవల్లో రెచ్చిపోయి హంగామా చేశారట మహిళలు మహారాణులు .

బ్యాచిలర్ పార్టీ మగవాళ్ళు మాత్రమేనా చేసుకునేది మేము సైతం అంటూ మగాళ్లకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో మద్యం తాగుతూ , సిగరెట్ లు కాల్చుతూ ఆకాశంలో సగం అని నిరూపించారట . బాలీవుడ్ నుండి హాలీవుడ్ బాటపట్టిన ప్రియాంక చోప్రా కు అక్కడ నిక్ జోనాస్ పరిచయం కావడంతో అతడితో డేటింగ్ మొదలుపెట్టింది . తనకంటే పదేళ్ల చిన్నవాడు అయినప్పటికీ పెళ్లి చేసుకోవడానికి అవి ఏమి అడ్డుకాలేదు . దాంతో అంగరంగ వైభవంగా వివాహ నిశ్చితార్థం జరిగింది , ఇక డిసెంబర్ లో పెళ్ళికి సిద్ధం అవుతోంది ప్రియాంక చోప్రా .

- Advertisement -

English Title: Parineeti chopra joins in priyanka chopra’s bachelor party

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All