Homeటాప్ స్టోరీస్ఆక‌ట్టుకుంటున్న ప‌రేష్ రావ‌ల్ ట్వీట్‌!

ఆక‌ట్టుకుంటున్న ప‌రేష్ రావ‌ల్ ట్వీట్‌!

ఆక‌ట్టుకుంటున్న ప‌రేష్ రావ‌ల్ ట్వీట్‌!
ఆక‌ట్టుకుంటున్న ప‌రేష్ రావ‌ల్ ట్వీట్‌!

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఎక్క‌డో ఎవ‌డో ఏదో తిన్నాడ‌ని ప్ర‌పంచం మొత్తం చేతులు క‌డుక్కుంటోంది. క‌డుక్కోమ‌ని చెబుతోంది. పండితుడి నుంచి పామ‌రుడి వ‌ర‌కు, సెలబ్రిటీ నుంచి సామార్యుడి వ‌ర‌కు కరోనా అంటే ఉలిక్కిప‌డుతున్నారు. దీనికి ధ‌నిక, పేద అనే తార‌త‌మ్యాలు లేవు. బ‌లిసిన‌వాడు బక్క‌వాడు అని, ఈ మ‌తం, ఆ మ‌తం అని తేడాలు అంటూ దీనికి సంబంధం లేదు. ఎవ‌రైనా అశ్ర‌ద్ధ వ‌హిస్తే క‌బ‌లించేస్తోంది.

ఇది వైర‌సా లేక మాయా అనేంత‌గా ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తూరే జీవిత పాఠాల్ని నేర్పుతోంది. కొత్త కొత్త విష‌యాల్ని గుర్తుచేస్తోంది. పాత‌వే అయినా అవే ముఖ్య‌మ‌ని చెబుతోంది. ప‌ట్ట‌ణాలు కాదు ప‌ల్లెలే ప‌ట్టుకొమ్మ‌ల‌ని, ప‌ల్లెల్ని గౌర‌వించాల‌ని, ఉన్న ఊరు క‌న్న‌త‌ల్లి అని చాటి చెబుతోంది. ఇదిలా వుంటే బాలీవుడ్ న‌టుడు పరేష్ రావెల్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా పెట్టిన పోస్ట్ ఆక‌ట్టుకుంటూనే ఆలోచింప‌జేస్తోంది.

- Advertisement -

`క‌రోనా వైర‌స్ అంతం అయిన త‌రువాత మ‌న సెల‌వుల‌ని ఇత‌ర దేశాల్లో కాదు ఇండియాలోనే గ‌డ‌పండి. స్థానికి రెస్టారెంట్‌ల‌లోనే తినండి..స్థానికి మంసాన్ని, కూర‌గాయ‌ల‌నే కొనండి..భార‌తీయ డ్రాండ్ల‌కు చెందిన బ‌ట్ట‌లు, షూస్‌నే కొనండి. స్థానికి వ్యాపారుల‌కు మ‌ద్ద‌తుగా నిల‌వండి. ఈ వ్యాపారాలు మ‌న స‌హాయం లేకుండా మ‌న లేవు` అంటూ ప‌రేష్ రావ‌ల్ పెట్టిన ట్వీట్ ఆక‌ట్టుకుంటూనే స్వ‌దేశీ వ‌స్తువులనే ఇక నుంచి ప్రోత్స‌హిద్దాం అనే అర్థాన్ని సందేశాన్ని అందిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All