Homeటాప్ స్టోరీస్ప‌వ‌న్ సినిమా నుంచి మ‌రో లీక్‌!

ప‌వ‌న్ సినిమా నుంచి మ‌రో లీక్‌!

ప‌వ‌న్ సినిమా నుంచి మ‌రో లీక్‌!
ప‌వ‌న్ సినిమా నుంచి మ‌రో లీక్‌!

స్టార్ హీరోల సినిమాల‌కు లీకుల భ‌యం ప‌ట్టుకుంది. సెట్‌లో ఫోన్‌ల వాడ‌కం పెరిగిపోయిన త‌రువాత స్టార్ హీరోల చిత్రాల‌కు సంబంధించిన ప్ర‌తీ సీన్ లీక్ అవుతూనే వుంది. ఇటీవ‌ల `ఆర్ ఆర్ ఆర్‌`కు సంబంధించి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌పై చిత్రీక‌రిస్తున్న పులి ఫైట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో లీక్ కావ‌డంతో రాజ‌మౌళి ఆందోళ‌నకు గురైన విష‌యం తెలిసిందే. తాజాగా ఇదే లీకుల బెడ‌ద ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ తాజా చిత్రాన్ని కూడా వెంటాడుతోంది. రెండేళ్ల విరామం త‌రువాత ప‌వన్‌క‌ల్యాణ్ `పింక్‌` రీమేక్‌తో మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డం మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే.

ఈ సినిమా ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో ప‌వ‌న్ న‌డుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు లీక్ కావ‌డంతో చిత్ర బృందంపై ప‌వ‌న్ సీరియ‌స్ అయ్యారు కూడా. తాజాగా ఇదే సినిమా నుంచి మ‌రో సీన్ లీకేజ్ అయి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. `నేను న‌ల్లకోటు వేసుకున్నానంటే వేసుకోవ‌డానికి పిటీష‌న్‌లు..తీసుకోవ‌డానికి మెయిల్లు వుండ‌వు` అని ఓ స‌న్నివేశంలో ప‌వ‌న్ చెబుతున్న ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్ప‌డు హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

- Advertisement -

ఇలా నిర్మాణ ద‌శ‌లోనే వ‌రుస లీకులు జ‌రుగుతుండ‌టంతో చిత్ర బృందం త‌ల‌ప‌ట్టుకుంటోంద‌ట‌. దీంతో సెట్‌లో ఫోన్‌ల వాడ‌కంపై ఆంక్ష‌లు విధించ‌బోతున్నార‌ట దిల్ రాజు. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజుతో క‌లిసి బోనీక‌పూర్ నిర్మిస్తున్నారు. ప‌వ‌న్ కెరీర్‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మాణం జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ కానుక‌గా రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All